వరుణ్ సందేశ్ 'కష్ట' కాలం
'హ్యాపీడేస్', 'కొత్తబంగారు లోకం' చిత్రాల వరుస విజయాలతో మంచి జోష్ మీదున్న వరుణ్ సందేశ్ ఆ తర్వత వచ్చిన 'ఎవరైనా ఎపుడైనా' చిత్రం పరాజయం తర్వాత డీలా పడిపోయాడు. దీనికి తోడు పారితోషికాన్ని అమాంతం పెంచేసిన వరుణ్ ను తీసుకోవడానికి నిర్మాతలు వెనుకడుగేస్తున్నారు.
హ్యాపీడేస్ చిత్రం ద్వారా తెరంగేట్రం చేసిన వరుణ్ ఆ సినిమాకు ఎలాంటి పారితోషికం తీసుకోకుండానే నటించాడు. ఆ తర్వాత వచ్చిన 'కొత్తబంగారు లోకం' చిత్రానికి 15 లక్షల రూపాయలు పారితోషికంగా అందుకున్నాడు. ఇటీవలే విడుదలైన 'ఎవరైనా ఎపుడైనా' చిత్రానికి 20 లక్షలు తీసుకున్నాడని తెలిసింది. ఆ తర్వాతి సినిమాలకి ఏకంగా కోటి రూపాయలు డిమాండ్ చేసాడట. కానీ ఆ చిత్రం బాక్సాఫీస్ వద్ద బోల్తాకొట్టడంతో ఒక్కసారిగా వరుణ్ క్రేజ్ పడిపోయింది. దీంతో వరుణ్ తో సినిమాలు చెయ్యాలనుకున్న నిర్మాతలు కొత్తగా వచ్చిన నాని, తనీష్ లను సంప్రదిస్తున్నారట. దీంతో వరుణ్ పారితోషికాన్ని 15 లక్షలకు తగ్గించకొని సినిమాలు చేస్తున్నాడట.


Click it and Unblock the Notifications











