హీరోయిన్లతో రెచ్చిపోతున్న వరుణ్ సందేష్
హ్యాపీడేస్ సినిమా ద్వారా టాలీవుడ్‌లోకి ఎంటరైన వరుణ్ సందేష్, ఆ తర్వాత కొత్తబంగారు లోకం సినిమా ద్వారా మరో హిట్టు కొట్టినా...ఇతర యువ హీరోల్లా తనదైన మార్కును మాత్రం వేయలేక పోయాడు. అడపా దడపా సినిమాలతో అలా నెట్టుకొస్తున్న వరుణ్ కెరీర్‌కి డ్రగ్స్ కేసు బ్యాడ్ నేమ్ తెచ్చింది. ఇప్పడు చాలా మంది అతన్ని డ్రగ్స్ హీరో అని పిలవడం మొదలు పెట్టారంటే పరిస్థితి ఎక్కడి వరకు వచ్చిందో అర్థం చేసుకోవచ్చు.
ఆ గొడవ పక్కన పెడితే...వరుణ్ ఈ మధ్య హీరోయిన్లతో రెచ్చపోతున్నాడు. తనతో నటించిన ప్రతి హీరోయిన్‌తోనూ ముద్దు సీన్లలో మునిగి తేలుతున్నాడు. తొలి సినిమా హ్యాపీడేస్‌లోనే మనోడు ముద్దు సీన్లతో హల్‌చల్ సృష్టిద్దామని అనుకున్నాడట. అయితే శేఖర్ కమ్ముల వరుణ్‌కు ఆ అవకాశం ఇవ్వలేదు. కొత్త బంగారులోకంలో ముద్దు సీన్లు పెట్టే సందర్భం రాలేదు. ఆ తర్వాత నుంచి మాత్రం వరుణ్ జోరు పెంచాడు. ఎవరైనా ఎపుడైనా సినిమాలో విమలా రామన్‌తో, ఏమైంది ఈ వేళ సినిమాలో నిషా అగర్వాల్‌తో ముద్దులతో ఎంజాయ్ చేసిన హీరో ఈ మధ్య వచ్చిన బ్రహ్మిగాడి కథలోనూ అస్మితా సూద్ తోనూ పెదవులు కలిపాడు.
ఇప్పటి వరకు ఒకటి రెండు ముద్దులతోనే సరిపెట్టుకున్న వరుణ్...తన తర్వాతి సినిమా 'ప్రియుడు"లో తన సరసన నటించే ప్రితికా రావుతో ఏకంగా ఐదుముద్దు సీన్లకు ప్లాన్ చేశాడట. వరుణ్ తీరు చూస్తుంటే సక్సెస్ లతో సంబంధం లేకుండా కేవలం హీరోయిన్లతో ఎంజాయ్ చేయడానికి ఇలాంటి సీన్లకు ప్లాన్ చేస్తున్నట్లు టాలీవుడ్ గుసగుస.


Click it and Unblock the Notifications











