బ్యాంకాక్‌లో తన్నులు తిన్న హీరో వరణ్ సందేశ్?

ఈ సారి బ్యాంకాక్‌లో ఓ మహిళ పట్ల అతని అభ్యంతరకర ప్రవర్తన కారణంగా అక్కడి జనం అతన్ని కొట్టారని వార్తలు వినిపిస్తున్నాయి. ఓ ప్రముఖ పత్రిక కథనం ప్రకారం...మంచు ఫ్యామిలీ మల్టీ స్టారర్ షూటింగులో భాగంగా వరుణ్ సందేశ్ బ్యాంకాక్ వెళ్లారని, షూటింగ్ ముగిసిన తర్వాత అక్కడి రెస్టారెంటుకు వెళ్లాడని, ఈ క్రమంలో లోకల్ బ్యాంకాక్ గర్ల్‌కు తన బాడీని తాకిస్తూ వరుణ్ సందేశ్ వెళ్లడంతో వెంటనే ఘర్షణ చోటు చేసుకుంది. చాలా మంది గుమికూడారని, అందులో కొందరు వరుణ్‌పై పిడిగుద్దులు కురిపించారని తెలుస్తోంది.
యూనిట్ సభ్యుల్లో ఒకరు ఈ విషయం గమనించి మంచు మనోజ్‌కు సమాచారం అందించారని, వెంటనే వారు రంగంలోకి దిగారని, ఈ గొడవకు కారణం లోకల్ మాఫియా కావడంతో పోలీసులు సైతం సంఘటన స్థలానికి వచ్చారని, వెంనటే వరుణ్‌ను సమీపంలోని హోటల్‌కు తీసుకెళ్లారని తెలుస్తోంది.
ఈ వ్యవహారంలో వరుణ్ సందేశ్ తప్పు ఉన్నట్లు చెబుతున్నారు. సినిమాల్లో మాదిరి రియల్ లైఫ్‌లో అత్యుత్సాహం ప్రదర్శిస్తే ఇలానే జరుగుతుందని, వేరే దేశంలో ఉన్నప్పుడు కాస్త ఒళ్లు దగ్గర పెట్టుకుని మర్యాదపూర్వకంగా ఉంటనే మంచిదనే వాదన సర్వత్రా వినిపిస్తోంది.


Click it and Unblock the Notifications











