'హ్యాంగోవర్' ప్రీమేక్ లో ఆ యంగ్ హీరో

By Srikanya

హాలీవుడ్ లో వచ్చిన చిన్న చిత్రాల్లో పెద్ద విజయం సాధించిన చిత్రం హ్యాంగోవర్. ఈ చిత్రాన్ని ఇప్పుడు తెలుగులో ప్రీమేక్ చేస్తున్నట్లు సమాచారం. ఈ చిత్రంలో వరుణ్ సందేశ్ హీరోగా చేస్తున్నట్లు చెప్పుకుంటున్నారు. నిన్న ఓపినింగ్ అయిన కుమార్ బ్రదర్స్ చిత్రం ఇదేనంటున్నారు. ఇక ఈ చిత్రం ఓపినింగ్ లో సినిమా గురించి వరుణ్ సందేశ్ మాట్లాడుతూ..''ప్రతీసారీ ప్రేమకథల్లోనే ఎందుకు కనిపిస్తావు? అని అడుగుతున్నారు. ఆ పాత్రల్లోంచి ఈ సినిమా నన్ను బయటకి తీసుకొస్తుంది. తొలి సన్నివేశం నుంచి శుభం కార్డు పడే వరకూ నవ్విస్తామ''న్నారు. నంద్యాల రవి మాట్లాడుతూ -''ఈ సినిమాకి మంచి నిర్మాత దొరికారు. రాధాకృష్ణ పాటలిస్తేనే బాగుంటుందని పట్టుబట్టి మరీ ఆయన్ను ఒప్పించాను'' అని చెప్పారు.

డి.సురేష్‌బాబు మాట్లాడుతూ -''ఈ బేనర్‌లో నిర్మిస్తున్న ఆరవ సినిమా ఇది. దాదాపు తెలుగు పరిశ్రమలో ఉన్న హాస్యనటీనటులందరూ ఇందులో నటిస్తున్నారు. కుటుంబ సమేతంగా చూడదగ్గ వినోదాత్మక చిత్రం ఇది. వచ్చే వేసవికి సినిమాని విడుదల చేస్తాం'' అన్నారు. మోనాల్‌ గజ్జర్‌ హీరోయిన్ గా చేస్తున్న ఈ చిత్రంతో రచయిత నంద్యాల రవి ఈ చిత్రంతో దర్శకుడిగా పరిచయమవుతున్నారు. ఈ చిత్రం బుధవారం ఉదయం హైదరాబాద్‌లో ప్రారంభమైంది. తొలి సన్నివేశానికి బూరుగుపల్లి శివరామకృష్ణ క్లాప్‌నిచ్చారు. భీమనేని శ్రీనివాసరావు స్విచ్చాన్‌ చేశారు.వెన్నెల కిషోర్, ప్రసాద్ బార్వే, వినయ్, సత్యం రాజేష్, ధనరాజ్ తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి కెమెరా: సాయిశ్రీరామ్, సమర్పణ: సుధీర్ దొడ్డ, సహనిర్మాత: పాండు, సంగీతం: కె.ఎమ్‌.రాధాకృష్ణ.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X