ముమైత్ తో సంభంధం..వరుణ్
ముమైత్ ఖాన్ తో హ్యాపీస్టార్ వరుణ్ సందేశ్ కి సంభంధం ఉందంటూ కొంత కాలంగా మీడియాలో వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే. అయితే అటువంటిదేమీ లేదని వరుణ్ తాజా ఇంటర్వూలో ఖండిస్తున్నారు. తన కోసమే ముమైత్ బరువు తగ్గిందంటూ జరుగుతున్న ప్రచారాన్ని ఎవరో కావాలని చేస్తున్న వ్యవహారంగా కొట్టిపారేసాడు. తనకీ ముమైత్ కి ముఖ పరిచయం తప్ప మరేమీ లేదని, అసలు ఇలాంటి రూమర్స్ ఎందుకు పుట్టిస్తున్నారో అర్ధం కావటం లేదని మండిపడుతున్నాడు. ఇక ప్రస్తుతం వరుణ్ తమిళంలో హిట్టయిన పొల్లాదవాన్ రీమేక్ లో నటిస్తున్నాడు. జెమిని కిరణ్ నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని గుణ్ణం గంగరాజు కుమారుడు గుణ్ణం సందీప్ డైరక్ట్ చేస్తున్నాడు.అలాగే రెండు వారాల క్రితం రిలీజైన ఎవరైనా..ఎపుడైనా చిత్రం ప్రమోషన్ లోనూ వరుణ్ బిజీగా పాల్గొంటున్నాడు. వీటితో పాటు దిల్ రాజు నిర్మిస్తున్న మరో చరిత్ర రీమేక్ లోను చేస్తున్నాడు. దానిని ప్రముఖ కెమెరామెన్ రవియాదవ్ డైరక్ట్ చేస్తున్నారు.


Click it and Unblock the Notifications











