Don't Miss!
- News రెండో రోజు నామినేషన్ల జోరు: 69 నామినేషన్లు వేసిన 57 మంది అభ్యర్థులు, ప్రముఖులు వీరే
- Sports ధోనీ ట్రేడ్మార్క్ సిక్సర్..101 మీటర్ల దూరం Video
- Automobiles వెస్పా 140 వ యానివర్సరీ వేడుకలు.. స్పెషల్ ఎడిషన్ స్కూటర్ లాంచ్..
- Lifestyle వేసవిలో కిడ్నీలు భద్రంగా ఉండాలంటే రోజూ ఎన్ని గ్లాసుల నీళ్లు తాగాలో తెలుసా?
- Technology రియల్మి ప్యాడ్ 2 వైఫై వేరియంట్ సేల్ ప్రారంభం.. రూ.2000 తగ్గింపు.. ఆఫర్ కొన్నిరోజులు మాత్రమే..!!
- Travel తెలంగాణలోని గొంతెమ్మగుట్ట సందర్శనకు బయలుదేరుదామా..?
- Finance Market Closing: మార్కెట్లను వీడిన నిరాశ మేఘాలు.. లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ..
వరుణ్ కి కుదిరితే కప్పుకాఫీ కుదరకపోతే గ్లాస్ బీరట...
తెలుగు సినీ పరిశ్రమ మొత్తంలో ఎవరికీ అంతు పట్టని ఒకే ఒక భేతాళ ప్రశ్న హీరో వరుణ్ సందేశ్. గత జన్మ(సంవత్సరం)లో ఎప్పుడో రెండు హిట్స్ ఇచ్చాడని ఇంకా మన నిర్మాతలు ఈ టింగరి హీరోని నమ్ముకుని సినిమాలు తీయడానికి ముందుకొస్తున్నారంటే వారిది అజ్ఝానమో?అవివేకమో? తెలియట్లేదు. అయినా ఈ 'కుర్రాడు" మాత్రం ఎంచక్కా 'హ్యాపీ హ్యాపీ"గా ప్లాపులు మీద ప్లాపులు ఇచ్చుకుంటూ ప్లాపుల్లో సరికొత్త 'మరో చరిత్ర" సృష్టిస్తున్నాడు.
ఓ నెల క్రితం విడుదలైన 'ఏమైంది ఈవేళ" కూడా ఏమైందో ఎవరికీ అర్థం కాకుండా వెళ్లిపోయింది. ఇంతటి దారుణ చిత్రాల నడుమ కూడా వరుణ్ బాబుని వెతుక్కుంటూ 'కుదిరితే కప్పు కాఫీ" తీసుకొస్తున్నారు. మూన్ వాటర్ ఫిల్మ్ అధినేతలు. సినిమాలలో, లోపలి తతంగం తెలిసిన వాళ్లయితే ఏముంది వరుణ్ కి ఇది అలవాటే సినిమా హిట్టయితే ఓ కప్పు కాఫీ తాగేస్తాడు..లేక ప్లాపయితే ఓ గ్లాస్ బీరు తాగేసి అంతా మర్చిపోతాడంటూ కామెడీగా మాట్లాడుకుంటున్నారు.