రంగంలోకి దిగుతున్న వరుణ్ తేజ్.. మరో నెల రోజుల్లో స్టార్ట్!
తెలుగు చిత్రసీమలో విలక్షణ కథాంశాలను ఎంచుకుంటూ సూపర్ జోష్ కొనసాగిస్తున్నారు మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్. విభిన్నమైన కథలకు, వైవిధ్య భరిత పాత్రలకు తాను మాత్రమే సూట్ అవుతా అని నిరూపించుకున్నారు ఈ యంగ్ హీరో. ఈ నేపథ్యంలో ఇటీవలే ఎఫ్ 2, గద్దలకొండ గణేశ్ సినిమాలతో సూపర్ డూపర్ హిట్స్ ఖాతాలో వేసుకున్న వరుణ్ తేజ్ తన తదుపరి సినిమా కోసం రెడీ అయ్యారు.
కిరణ్ కొర్రపాటి దర్శకత్వంలో బాక్సింగ్ నేపథ్యంలో తెరకెక్కనున్న సినిమాకు ఓకే చెప్పిన వరుణ్.. ఈ సినిమా కోసం కొన్ని నెలలుగా బాక్సింగ్‌లో శిక్షణ కూడా తీసుకున్నారు. ఈ మధ్యనే ఆ శిక్షణ పూర్తయిందని సమాచారం. దీంతో ఇక చిత్ర రెగ్యులర్ షూట్ మొదలుపెట్టాలని భావించిన దర్శకనిర్మాతలు అందుకోసం వచ్చేనెల 17 ముహూర్తం ఫిక్స్ చేసినట్లు తెలుస్తోంది.

అల్లు బాబీ - సిద్ధూ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమా, ఫిబ్రవరి 17వ తేదీ నుంచి వైజాగ్‌లో రెగ్యులర్ షూటింగ్ జరుపుకోనుంది. చిత్రంలో ప్రతినాయకుడిగా బాలీవుడ్ సీనియర్ హీరో సునీల్ శెట్టి నటించనుండగా, హాలీవుడ్ స్టంట్ మాస్టర్ లార్నెల్ స్టోవాల్ ఫైట్స్ ను కంపోజ్ చేస్తున్నాడు. ఇక ఈ సినిమాలో నటించబోయే హీరోయిన్, ఇతర నటీనటుల వివరాలు త్వరలోనే ప్రకటించనుంది చిత్రయూనిట్.


Click it and Unblock the Notifications











