‘F3’ మూవీ హీరోలకు ఆరోగ్య సమస్యలు: అనిల్ రావిపూడి ఎంత పని చేస్తున్నావయ్యా!

ఈ మధ్య కాలంలో తెలుగు సినీ ఇండస్ట్రీలో మల్టీస్టారర్ మూవీల హవా కనిపిస్తోంది. గతంతో పోల్చుకుంటే ఇప్పుడు ప్రేక్షకులు, అభిమానుల ఆలోచనా ధోరణిలో మార్పులు రావడానికి తోడు హీరోలు సైతం ఈ తరహా సినిమాలు చేయడానికి ముందుకు వస్తున్నారు. అంతేకాదు, ఇలా వచ్చిన చాలా చిత్రాలు సూపర్ డూపర్ హిట్లుగా నిలిచాయి. దీంతో చాలా కాలంగా తెలుగులో మల్టీస్టారర్ మూవీలు మరిన్ని పట్టాలెక్కుతున్నాయి. ఇలా రెండేళ్ల క్రితం సంక్రాంతి సీజన్‌లో ప్రేక్షకుల ముందుకు వచ్చి.. భారీ విజయాన్ని అందుకున్న చిత్రమే 'F2' (ఫన్ అండ్ ఫ్రస్టేషన్).

సీనియర్ హీరో విక్టరీ వెంకటేష్.. మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ కలిసి నటించిన చిత్రం 'F2' (ఫన్ అండ్ ఫ్రస్టేషన్). బడా ప్రొడ్యూసర్ దిల్ రాజు నిర్మించిన ఈ సినిమాను సక్సెస్‌ఫుల్ డైరెక్టర్ అనిల్ రావిపూడి తెరకెక్కించాడు. ఇందులో తమన్నా భాటియా, మెహరీన్ హీరోయిన్లు. ఇద్దరు హీరోలు వివాహం తర్వాత ఎదుర్కొన్న పరిస్థితులను ఫన్నీగా చూపిస్తూ ఈ సినిమాను తెరకెక్కించారు. ప్రస్తుతం దీనికి 'F3' పేరిట సీక్వెల్‌ను కూడా తీస్తున్న విషయం తెలిసిందే. తాజాగా ఈ సినిమాకు సంబంధించిన అదిరిపోయే న్యూస్ ఒకటి ఫిలిం నగర్ ఏరియాలో విపరీతంగా వైరల్ అవుతోంది.

మొదటి భాగానికి మించి పోయేలా 'F3' చిత్రాన్ని రూపొందిస్తున్నాడు దర్శకుడు అనిల్ రావిపూడి. ఇప్పటికే దీనికి సంబంధించిన చాలా వరకూ షూటింగ్ పూర్తైంది. ఇప్పుడు చివరి షెడ్యూల్‌ను కూడా జరుపుతున్నారు. ఈ సినిమాలో విక్టరీ వెంకటేష్ రేచీకటి సమస్యతో బాధ పడుతోన్న వ్యక్తిగా నటిస్తున్నాడని కొద్ది రోజుల క్రితం ఓ న్యూస్ బయటకు వచ్చింది. ఇది ఎంతో ఫన్నీగా ఉంటుందన్న టాక్ కూడా వినిపించింది. ఇందులో వెంకటేష్ పాత్ర సినిమాకే హైలైట్‌గా నిలుస్తుందని అంటున్నారు. దీంతో ఈ మూవీపై అంచనాలు మరింత ఎక్కువగా పెరిగిపోయాయి.

Varun Tej And Daggubati Venkatesh Health Problems Highlight in F3

ఇక, ఎంతో ప్రతిష్టాత్మకంగా 'F3' మూవీలో వరుణ్ తేజ్ పాత్ర కూడా స్పెషల్ అట్రాక్షన్ కాబోతుందట. తాజా సమాచారం ప్రకారం.. ఇందులో ఈ యంగ్ హీరో నత్తి సమస్యతో బాధ పడుతోన్న వ్యక్తిగా కనిపిస్తాడని తెలిసింది. ఫస్ట్ పార్ట్‌లో వెంకీ పాత్రతో పోటీ పడేలా నటించిన అతడు.. ఈ సినిమాలో మాత్రం దాన్ని డామినేట్ చేసేలా చేస్తున్నాడని తెలుస్తోంది. మరీ ముఖ్యంగా ఈ సినిమాలో వరుణ్ తేజ్ చెప్పే డైలాగులు ఎంతో ఫన్‌ను పంచబోతున్నాయనే టాక్ వినిపిస్తోంది. మొత్తానికి ఈ చిత్రంలో ఇద్దరు హీరోలు ఆరోగ్య సమస్యలతో బాధ పడుతూ మజాను పంచబోతున్నారని తెలిసింది.

క్రేజీ కాంబినేషన్‌లో సూపర్ హిట్ మూవీకి సీక్వెల్‌గా వస్తోన్న 'F3'పై అంచనాలు భారీగా ఉన్నాయి. అందుకు అనుగుణంగానే దీన్ని తెరకెక్కిస్తున్నారు. ఇక, ఇందులో ప్రముఖ హీరో కమ్ కమెడియన్ సునీల్ పాత్ర కూడా ప్రధాన ఆకర్షణగా నిలుస్తుందని అంటున్నారు. అతడితో పాటు రాజేంద్ర ప్రసాద్, సంగీత పాత్రలు కూడా ఆకట్టుకుంటాయన్న టాక్ వినిపిస్తోంది. అలాగే, ఇందులో ఓ స్టార్ హీరోయిన్ స్పెషల్ సాంగ్ చేయబోతుందని చెబుతున్నారు. ఈ సినిమాకు దేవీ శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నాడు. దీన్ని సంక్రాంతి కానుకగా విడుదల చేయబోతున్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X