RRR వదిలిన డేట్‌కు మెగా ప్రిన్స్ ఓటు.. !!

మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ ఓ వైపు ప్రయోగాలు చేస్తూనే.. కమర్షియల్ మీటర్‌లోనూ ప్రయాణిస్తున్నాడు. అన్ని రకాల చిత్రాలను చేస్తూ ప్రేక్షకులను మెప్పించే ప్రయత్నం చేస్తున్నాడు. ఈ క్రమంలోనే తొలిప్రేమ, అంతరిక్షం, ఎఫ్2, గద్దలకొండ గణేష్ వంటి చిత్రాలు వచ్చాయి. ప్రయోగాలు చేసి చేతులు కాల్చుకున్నా కూడా కొత్తగా ట్రై చేసేందుకు ఎన్నడూ వెనకాడలేదు.

అందుకే మరో వినూత్న చిత్రాన్ని ప్రేక్షకులకు అందించేందుకు సిద్దమయ్యాడు. బాక్సింగ్ నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ సినిమా కోసం అమెరికాలో ప్రత్యేక శిక్షణ తీసుకున్నాడు. పూర్తిగా తన శరీరాకృతిని మార్చుకున్న వరుణ్.. బాగానే చెమటోడ్చినట్టు తెలుస్తోంది. తాజాగా ఈ మూవీ షూటింగ్ కూడా మొదలైంది.

Varun Tej Boxer Is Going To Release On 30th July

ఈ మేరకు వరుణ్ ట్వీట్ చేశాడు. తన మూవీ షూటింగ్ వైజాగ్‌లో మొదలైంది.. అందరి ఆశీస్సులు కావాలంటూ పోస్ట్ చేశాడు. తాజాగా ఈ మూవీకి సంబంధించిన ఓ అప్‌డేట్ వచ్చేసింది. జూలై 30 అంటే అందరికీ గుర్తొచ్చేది RRR. దాదాపు రెండేళ్లుగా ఆ రిలీజ్ డేట్ అందరి నోళ్లలో నానిపోయింది. ఆ రోజు మరో అద్భుతం జరగబోతోందని ఎందరో ఎదురుచూశారు. అయితే ఆ అద్భుతాన్ని 2021 జనవరి 8కి వాయిదా వేశారు. తాజాగా వినిపిస్తున్న టాక్ మేరకు.. వరుణ్ తన చిత్రాన్ని జూలై 30కి విడుదల చేయాలని ఫిక్స్ అయ్యాడట. మరి దీనిపై చిత్రయూనిట్ స్పందించాల్సి ఉంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X