Don't Miss!
- Sports SRHకు భయపడి CSK సంచలన నిర్ణయం: ధోనీ మైండ్ గేమ్?
- Finance Stock Market Close: భారీ లాభాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు..
- Lifestyle హడలెత్తిస్తున్న Bird Flu పాలు,గుడ్లు మరియు చికెన్ తినడం సురక్షితమేనా?మనుషులకూ వ్యాపిస్తుందా..నిపుణులు ఏమంటారు?
- News గెలిస్తే వాషింగ్టన్ డీసీ చేస్తా అన్నావ్.. రాజధానే లేకుండా చేశావ్ జగనన్నా.. షర్మిల చురకలు
- Technology Infinix GT 20 Pro 5G డిజైన్ రెండర్లు లీక్ అయ్యాయి! స్పెసిఫికేషన్ల వివరాలు
- Automobiles వందేభారత్ రైళ్లలో 1 లీటర్ వాటర్ బాటిల్ రద్దు.. రైల్వే శాఖ కీలక నిర్ణయం
- Travel కేవలం రూ. 5వేలతో హిమాచల్‌ప్రదేశ్‌లోని ఈ ప్రాంతాలను చుట్టేయొచ్చు..!
ఆ సినిమా విషయంలో అసంతృప్తితో మెగా హీరో.. ఇంత కష్టపడుతున్నా ఫలితం లేదని!
మెగా హీరో వరుణ్ తేజ్ గని అనే సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే.. బాక్సింగ్ నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ సినిమాని నూతన దర్శకుడు కిరణ్ కొర్రపాటి తెరకెక్కిస్తున్నారు.. ఇక ఈ సినిమాతో అల్లు అరవింద్ పెద్ద కుమారుడు అల్లు బాబి నిర్మాతగా టాలీవుడ్ కి పరిచయం అవుతున్నారు. అయితే ఈ సినిమా షూటింగ్ విషయంలో ఇప్పుడు గందరగోళం నెలకొన్నన్నట్లు ప్రచారం జరుగుతోంది. నిజానికి ఈ సినిమాని అల్లు బాబి ఒక్కరే నిర్మించడం లేదు. ఆయన తన స్నేహితుడు సిద్ధూతో కలిసి ఈ సినిమాని నిర్మిస్తున్నారు. అయితే ఈ సినిమా కథ విషయంలో నే వరుణ్ తేజ్ దర్శకుడికి కొన్ని మార్పులు చేర్పులు సూచిస్తున్నాడని తెలుస్తోంది. అయితే ఆ మార్పులు చేర్పులు చేయడానికి దర్శకుడు సిద్ధంగా లేరని అంటున్నారు.
అదీ కాక ఈ సమయంలో దాదాపు 50 లక్షల విలువచేసే ఒక సెట్ సినిమా కోసం నిర్మించారట.. కానీ అందులో ఎలాంటి షూటింగ్ నిర్మించకుండానే సెట్ మళ్ళి కూల్చేసినట్లు తెలుస్తోంది. అయితే ఈ గందరగోళం విషయంగా దర్శకుడు కిరణ్ కొర్రపాటిని సంప్రదిస్తే ఇవన్నీ పుకార్లు అని ఆయన తేల్చేశారు. షూటింగ్ క్యాన్సిల్ అయిన మాట వాస్తవమే కానీ ప్రచారం జరుగుతున్నట్లుగా దాని వెనుక వేర్వేరు కారణాలు ఏమీ లేవని ఆయన చెప్పుకొచ్చారు. వరుణ్ తేజ్ చేతికి గాయం అయిన కారణంగా షూట్ క్యాన్సిల్ అయ్యిందని ఆ తర్వాత ఆయన కరోనా బారిన పడడం షూట్ కంటిన్యూ చేయలేకపోయామని చెప్పుకొచ్చారు.
ఇక సినిమా కోసం ఫారెన్ ఫైట్ మాస్టర్స్ ని తీసుకున్న నేపధ్యంలో వాళ్ళు వాళ్ళ దేశాల్లో ఉండిపోయి ఇక్కడికి రాలేని పరిస్థితుల్లో షూటింగ్ జరపలేక పోతున్నామని చెప్పుకొచ్చారు. అలాగే సినిమా విషయంలో ఎలాంటి గందరగోళం లేదని, ఇవన్నీ కేవలం పుకార్లు మాత్రమేనని ఆయన చెప్పుకొచ్చారు. అయితే ఒక విషయంలో మాత్రం హీరో అసంతృప్తిగా ఉన్నారనే మాట పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతోంది. ఇది బాక్సింగ్ నేపథ్యంలో తెరకెక్కుతున్న సినిమా కాబట్టి సినిమా మొత్తం వరుణ్ తేజ్ ఒకే ఫిజిక్ మెయింటైన్ చేయాల్సి ఉంటుంది. డైట్ విషయంలో కూడా ఆయన చాలా స్ట్రిక్ట్ గా ఫాలో కావాల్సి ఉంటుంది. షూటింగ్ లేట్ అయిన కొద్దీ ఆయనకు ఈ విషయంలో కాస్త అసహనం నెలకొంటుందని అంటున్నారు. మొత్తం మీద ఈ సినిమా విషయంలో ఎలాంటి గందరగోళం లేదని క్లారిటీ వచ్చినట్లయింది.