నాగబాబు కొడుకు ఎంట్రీ దర్శకుడు ఛేంజ్ ??
వరుణ్ తేజ్ ను పూరి జగన్నాథ్ చేతులమీదుగానే హీరోగా పరిచయం చేయాలని మెగా ఫ్యామిలీ ప్లాన్. చిరుతతో రామ్ చరణ్ ని ఘనంగా లాంచ్ చేయటంతో ఈ అవకాసం సైతం పూరీకే అప్పచెప్తున్నట్లు చెప్తున్నారు. ఇక ఈ సినిమాను వైజయంతీ మూవీస్ పతాకంపై సి.అశ్వనీదత్ నిర్మిస్తారని సమాచారం. స్టార్ హీరోల తనయుుల్ని హీరోలుగా పరిశ్రమకు పరిచయం చేయడంలో అశ్వనీదత్‌ది ఘనమైన చరిత్ర.
అశ్వనీదత్ ది గోల్డెన్ హ్యాండ్ అని,ఆయన బ్యానర్ ద్వారా లాంచ్ అయితే కెరిర్ లో సెటిల్ అవ్వచ్చనే ఓ స్ట్రాటజీతో ముందుకు వస్తున్నట్లు తెలుస్తోంది. గతంలో అశ్వనీద్ తన బ్యానర్ ద్వారా మహేష్ బాబు, రామ్ చరణ్ తేజలను పరిచయం చేసారు. మహేష్ తో రాజకుమారుడు, రామ్ చరణ్ తో చిరతగా ఆ చిత్రాలు భాక్సాఫీస్ లను పలకరించాయి. సినిమా రిజల్ట్ లు యావరేజ్ గా ఉన్నా వారు మాత్రం స్టార్స్ గా సెటిల్ అయ్యిపోయారు.
వాస్తవానికి 2009లోనే రవిబాబు 'నచ్చావులే' సినిమా ద్వారా వరుణ్‌తేజ్ హీరోగా ఎంటర్ అవ్వాల్సి ఉంది. అయితే కొన్ని కార ణాల వల్ల ఈ ప్రాజెక్టు వరుణ్ తేజకు ఓకే కాలేదు. తర్వాత 2009, 2010లో ఇందు కు సంబం ధించిన ప్రయ త్నాలు జరి గినా... మెగా ఫ్యామిలీ అంతా అప్పుడు రాజకీ యాల్లో బిజీబిజీగా గడపడంతో పక్కన పెట్టారు. ఇప్పుడు అంతా సర్దుకోవడంతో మళ్లీ వరుణ్‌తేజ్ హీరోగా ఎంట్రీ విషయం దృష్టి పెట్టారు.


Click it and Unblock the Notifications












