వరుణ్ తేజ్ 'గొల్లభామ' లాంచ్ ముహూర్తం..వెన్యూ

By Srikanya

varun tej first film launch muhurath
హైదరాబాద్ : ఎప్పుడెప్పుడా అని మెగాభిమానులు ఎదురుచూస్తున్న రోజు రానే వస్తోంది. నాగబాబు కుమారుడు వరుణ్‌తేజ్‌ తొలి చిత్రం 'గొల్లభామ' లాంచింగ్ కి ముహూర్తం ఖరారు చేసారని సమాచారం. పిభ్రవరి 27న మహాశివరాత్రి స్పెషల్ గా రామానాయుడు స్టూడియోస్ లో ఉదయం 11:10 గంటలకు ఈ చిత్రం పూజా కార్యక్రమాలు ఘనంగా జరగనున్నాయని తెలుస్తోంది.

చిరంజీవి,పవన్ కళ్యాణ్, రామ్ చరణ్, అల్లు అర్జున్, సాయి ధరమ్ తేజ, అల్లు అరవింద్, నాగబాబు ఇంకా మిగతా మెగా ఫ్యామిలీ మెంబర్ అంతా ఈ వేడుకకు హాజరుకానున్నారు. అలాగే చిత్ర పరిశ్రమ నుంచి మెగా ఫ్యామిలీకి సన్నిహితులైన చాలా మంది పెద్దలు ఈ కొత్త కుర్రాడుని ఆశ్వీరదించటానికి పిలుపులు వెళ్లాయి. మెగాభిమానులు కూడా ఈ వేడకకు వస్తారని తెలుస్తోంది. ఇక ఈ చిత్రానికి శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వం వహించనున్నారు. పూజ హేడ్గే హీరోయిన్ గా చేస్తోంది.

'కొత్తబంగారులోకం',' సీతమ్మవాకిట్లో సిరిమల్లె చెట్టు' చిత్రాలతో తనదైన ముద్ర తెలుగు తెరపై వేసి ఆకట్టుకొన్నాడు శ్రీకాంత్ అడ్డాల. ఇప్పుడు వరుణ్‌తేజ్‌తో తొలి అడుగులు వేయించేందుకు సిద్ధమవుతున్నాడు.ఈ చిత్రానికి ఠాగూర్‌ మధు, నల్లమలపు శ్రీనివాస్‌ నిర్మాతలు. స్క్రిప్టు పనులు పూర్తయ్యాయి. అతి త్వరలోనే ఈ చిత్రం సెట్స్‌ మీదకు వెళ్లనుంది. మిక్కీ జె.మేయర్‌ సంగీతం అందిస్తారు. నటీనటులు, సాంకేతిక నిపుణుల వివరాలు త్వరలో తెలుస్తాయి.

2008లోనే రవిబాబు 'నచ్చావులే' సినిమా ద్వారా వరుణ్ తేజ్ హీరోగా ఎంటర్ అవ్వాల్సి ఉంది. అయితే కొన్ని కారణాల వల్ల ఈ ప్రాజెక్టు వరుణ్ తేజకు ఓకే కాలేదు. నాగబాబు కొడుకుకి సైతం గోదావరి బ్యాక్ డ్రాప్ ఆ తర్వాత 2009, 2010 సంవత్సరాల్లో ఇందుకు సంబంధించిన ప్రయత్నాలు జరిగినా... మెగా ఫ్యామిలీ అంతా అప్పుడు రాజకీయాల్లో బిజీబిజీగా గడపడం, 2011లో ప్రజారాజ్యం విలీనం ఇష్య్యూతో ఈ విషయాన్ని పక్కన పెట్టారు. ఇప్పుడు అంతా సర్దు కోవడంతో మళ్లీ వరుణ్ తేజ్ హీరోగా ఎంట్రీ విషయం దృష్టి పెట్టారు.

ప్రస్తుతం వరుణ్ తేజ్‌ హీరోగా నిలదొక్కుకునేందుకు కావాల్సిన క్వాలిటీస్‌ను మరింత మెరుగు పరుచుకునే పనిలో ఉన్నారు. ముఖ్యంగా డాన్స్‌ల విషయంలో చాలా కష్టడుతున్నాడని వినికిడి. మెగాస్టార్ చిరంజీవి తనతైన డాన్స్ స్టెప్పులతో థియేటర్లను షేక్ చేసాడు. ఆ తర్వాత ఆయన వారసత్వంతో అల్లు అర్జున్, రామ్ చరణ్ తేజ్ డాన్స్‌ల విషయంలో తమ ప్రత్యేకతను చాటుకున్నారు. ఇప్పుడు వరుణ్ తేజ్ కూడా స్టైల్ విషయంలో, డాన్స్ విషయంలో ప్రత్యేకత చాటుకోవడానికి ట్రై చేస్తున్నాడు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X