డిమాండ్ పెంచేసిన మెగా వారసుడు.. ఒక్క సినిమాకు అంత తీసుకుంటున్నాడా..?

మెగా వారసుడు, నాగబాబు తనయుడు వరుణ్ తేజ్ ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉన్నాడు. వైవిద్యభరితమైన కథలను ఎంచుకుంటూ పోతున్న ఈ యువ హీరో ఈ ఏడాది ఎఫ్ 2, గద్దలకొండ గణేష్ సినిమాల రూపంలో వరుస సక్సెస్‌లు తన ఖాతాలో వేసుకున్నాడు. దీంతో మెగా హీరోల్లోకెల్లా వరుణ్ తేజ్ సినిమాలకు, ఆయన చేస్తున్న క్యారెక్టర్స్‌కి స్పెషల్ క్రేజ్ నెలకొంది.

ఈ నేపథ్యంలోనే వరుణ్ తేజ్ రెమ్మ్యూనరేషన్ కి సంబంధించి ఓ ఆసక్తికర వార్త బయటకొచ్చింది. ప్రస్తుతం తనకున్న క్రేజ్ క్యాచ్ చేసుకుంటూ రెమ్మ్యూనరేషన్ బాగా పెంచేశారట వరుణ్ తేజ్. యువ హీరోల్లో కెల్లా ఎక్కువగా పారితోషికం ఆయనకే దక్కుతోందని తెలుస్తోంది. ఇండస్ట్రీలో తన సినిమాలకు పెరుగుతున్న గిరాకీ చూసి ఒక్కో సినిమాకు అయిదు నుంచి ఎనిమిది కోట్ల వరకు వసూలు చేస్తున్నారట మెగా ప్రిన్స్.

Varun Tej Increased His Remuneration..?

కథల ఎంపికలో వైవిధ్యం చూపిస్తూ నేటి తరం ప్రేక్షకులకి స్పెషల్ ట్రీట్ ఇస్తున్న వరుణ్ డిమాండ్ గద్దలకొండ గణేష్‌ విజయంతో మరింత పెరిగింది. అందుకే ఇదే సరైన సమయమని తన పారితోషికాన్ని ఆయన పెంచేశారని వార్తలు వస్తున్నాయి. బ్యానర్‌, డైరెక్టర్‌ని, కథను బట్టి ఆయన ఎనిమిది కోట్ల వరకు పారితోషికం డిమాండ్‌ చేస్తున్నారని టాక్. నూతన దర్శకుడు కిరణ్ కొర్రపాటి రూపొందించనున్న ఈ సినిమాలో వరుణ్ తేజ్ బాక్సర్ గా కనిపించబోతున్నాడు. అల్లు వెంకటేష్, ముద్దా సిద్దు సంయుక్తంగా ఈ సినిమాను నిర్మించనున్నారు. డిసెంబర్ నుంచి రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం కానుంది.

మరోవైపు గద్దలకొండ గణేష్ సినిమా తర్వాత మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ మరో ప్రాజెక్టుకు ముహూర్తం కుదిరింది. ఆయన కెరీర్‌లో 10వ సినిమాగా రాబోతున్న ఈ సినిమాను గురువారం రోజు ఫిలింనగర్ టెంపుల్ లో లాంఛనంగా మొదలుపెట్టారు. ఈ కార్యక్రమంలో హీరో వరుణ్ తేజ్, మెగా బ్రదర్ నాగబాబు, ప్రొడ్యూసర్ అల్లు అరవింద్, ఇతర యూనిట్ సభ్యులు హాజరయ్యారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X