ప్రేమలో పడ్డచోటే వరుణ్ తేజ్-లావణ్య త్రిపాఠి పెళ్లి.. ఎప్పుడు? ఎక్కడ అంటే?
మెగా ఫ్యామిలీ నుంచి వచ్చిన మరో హీరో వరుణ్ తేజ్. బాలనటుడిగా సినిమాలు మొదలు పెట్టిన వరుణ్ తేజ్ ముకుంద మూవీతో హీరోగా తెరంగేట్రం చేశాడు. కంచె, లోఫర్ సినిమాలతో ఆకట్టుకున్నాడు. ఇక ఫిదా, ఎఫ్ 2 మూవీలతో మంచి హిట్ అందుకున్నాడు.
ఈమధ్య వరుణ్ తేజ్ సినీ కెరీర్ డల్ గా సాగుతుండగా హీరోయిన్ లావణ్య త్రిపాఠితో ప్రేమ వార్తలు షికార్లు చేశాయి. ఎట్టకేలకు ఎంగేజ్ మెంట్ చేసుకున్న ఈ జంట త్వరలో పెళ్లి పీటలు ఎక్కబోతున్నారు. అయితే వరుణ్, లావణ్య వివాహం చేసుకునే ప్లేస్ ఆసక్తికరంగా మారింది.

వరుణ్ సినిమాలు: మెగా కుటుంబం నుంచి వచ్చి మంచి క్రేజ్ తెచ్చుకున్న హీరోల్లో వరుణ్ తేజ్ ఒకరు. నాగబాబు నటించిన హ్యాండ్సప్ మూవీలో బాల నటుడిగా చేసిన వరుణ్ తేజ్ ముకుంద సినిమాతో టాలీవుడ్ లోకి హీరోగా ఎంట్రీ ఇచ్చాడు. తర్వాత డిఫరెంట్ కథలను సెలెక్ట్ చేసుకుంటూ మంచి హిట్లు అందుకున్నాడు. కంచె, లోఫర్, మిస్టర్, ఫిదా, తొలి ప్రేమ, అంతరిక్షం 9000 కఎంపీహెచ్, ఎఫ్ 2, గద్దలకొండ గణేష్, ఘని, ఎఫ్ 3 చిత్రాల్లో నటించాడు.

నిజమైన పుకార్లు: ప్రస్తుతం గాండీవధారి అర్జునుడు సినిమాతో ప్రేక్షకు ముందుకు రానున్నాడు వరుణ్ తేజ్. ఇటీవలే విడుదల చేసిన ఈ మూవీ పోస్టర్ ఆకట్టుకుంది. ఇందులో వరుణ్ తేజ్ గూఢచారి రోల్ చేస్తున్నాడని టాక్. ఇదిలా ఉంటే మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ కు ముద్దుగుమ్మ లావణ్య త్రిపాఠికి మధ్య సంథింగ్ సంథింగ్ ఉందని వచ్చిన ఊహగానాలు.. పుకార్లు కాకుండా నిజమయ్యాయి.
మెగా ఫ్యామీలిలో సందడి: జూన్ 9న అంటే శుక్రవారం సాయంత్రం హైదరాబాద్ లోని నాగబాబు నివాసంలో మెగాస్టార్ చిరంజీవి-సురేఖ దంపతుల సమక్షంలో వరుణ్ తేజ్-లావణ్య త్రిపాఠి నిశ్చితార్థం ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకకు పవర్ స్టార్ పవన్ కల్యాణ్, అల్లు అర్జున్, రామ్ చరణ్ తేజ్, అల్లు అరవింద్, వైష్ణవ్ తేజ్ తోపాటు మెగా ఫ్యామిలీ మొత్తం పాల్గొంది.

మిస్టర్ షూటింగ్: వరుణ్ తేజ్-లావణ్య త్రిపాఠి ఎంగేజ్ మెంట్ జరగ్గా.. ప్రస్తుతం వీరి పెళ్లి విషయం ఆసక్తికరంగా మారింది. వీళ్లిద్దరికి ప్రేమ పునాది పడిన చోటే వరుణ్ లావణ్య పెళ్లి చేసుకోబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి. వీళ్లిద్దరు కలిసి మిస్టర్, అంతరిక్షం వంటి సినిమాల్లో నటించగా షూటింగ్ సెట్ లో ప్రేమ చిగురించింది.

ఆ ప్యాలెస్ లో: మిస్టర్ మూవీ షూటింగ్ కోసం ఇటలీ వెళ్లిన వరుణ్, లావణ్యలు అక్కడే స్నేహితులుగా మారారట. అది కాస్తా ప్రేమగా మారి త్వరలో పెళ్లి చేసుకున్నారు. అందుకే వీళ్లు కలిసిన చోటైన ఇటలీలో పెళ్లి చేసుకోవాలని డిసైడ్ అయ్యారట. ఇటలీలోని ఓ ప్రముఖ ప్యాలెస్ లో వీరి వివాహం జరుగుతుందని టాక్. ఇక వీరి పెళ్లి ఈ ఏడాది నవంబర్ లేదా డిసెంబర్ లో చేయనున్నారనిట సమాచారం.


Click it and Unblock the Notifications











