వరుణ్ తేజ్-లావణ్య త్రిపాఠి పెళ్లి వాయిదా.. ముందుగా అనుకున్నట్లే.. నాగబాబు షాకింగ్ ట్విస్ట్
మెగా కుటుంబం నుంచి వచ్చి మంచి క్రేజ్ తెచ్చుకున్న హీరోల్లో వరుణ్ తేజ్ ఒకరు. నాగబాబు నటించిన హ్యాండ్సప్ మూవీలో బాల నటుడిగా చేసిన వరుణ్ తేజ్ ముకుంద సినిమాతో టాలీవుడ్ లోకి హీరోగా ఎంట్రీ ఇచ్చాడు. తర్వాత డిఫరెంట్ కథలను సెలెక్ట్ చేసుకుంటూ మంచి హిట్లు అందుకున్నాడు. ప్రస్తుతం గాండీవధారి అర్జున సినిమాతో అలరించేందుకు రెడీగా ఉన్నాడు. అయితే త్వరలో వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠి డెస్టినేషన్ వెడ్డింగ్ జరగనుందని వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. తాజాగా ఈ పెళ్లి వాయిదా పడిందని మరో టాక్ వినిపిస్తుంది. అసలు ఏమైందనే వివరాల్లోకి వెళితే..
హాలీవుడ్ స్థాయిలో: గని సినిమాతో ప్లాప్ చూసిన వరుణ్ తేజ్ ప్రస్తుతం గాండీవధారి అర్జున (Gaandeevadhari Arjuna) సినిమాతో ప్రేక్షకు ముందుకు రానున్నాడు వరుణ్ తేజ్. ఇటీవల విడుదల చేసిన ఈ మూవీ ట్రైలర్ ఎంతగానో ఆకట్టుకుంది. ఇందులో వరుణ్ తేజ్ గూఢచారి రోల్ చేస్తున్నాడు. హాలీవుడ్ స్థాయిలో ఈ సినిమా ఉండనున్నట్లు ట్రైలర్ చూస్తుంటే తెలిసిపోతుంది.

అట్టహాసంగా నిశ్చితార్థం: ఇక మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ కు ముద్దుగుమ్మ లావణ్య త్రిపాఠికి మధ్య సంథింగ్ సంథింగ్ ఉందని వచ్చిన ఊహగానాలు వారి ఎంగేజ్ మెంట్ ద్వారా నిజమయ్యాయి. జూన్ 9న సాయంత్రం హైదరాబాద్ లోని నాగబాబు నివాసంలో మెగాస్టార్ చిరంజీవి-సురేఖ దంపతుల సమక్షంలో వరుణ్ తేజ్-లావణ్య త్రిపాఠి నిశ్చితార్థం ఘనంగా జరిగింది.
డెస్టినేషన్ వెడ్డింగ్:వరుణ్ తేజ్-లావణ్య త్రిపాఠి నిశ్చితార్థానికి పవర్ స్టార్ పవన్ కల్యాణ్, అల్లు అర్జున్, రామ్ చరణ్ తేజ్, అల్లు అరవింద్, వైష్ణవ్ తేజ్ తోపాటు మెగా ఫ్యామిలీ మొత్తం హాజరైంది. ఇక వీళ్లిద్దరికి ప్రేమ పునాది పడిన చోటే పెళ్లి చేసుకోబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి. వరుణ్, లావణ్య కలిసి మిస్టర్, అంతరిక్షం వంటి సినిమాల షూటింగ్ జరిగిన ఇటలీలో వీరి ప్రేమ చిగురించగా అక్కడే పెళ్లి చేసుకోనున్నారని తెలిసింది.

మళ్లీ వాయిదా: ఇటలీలోని ఓ ప్రముఖ ప్యాలెస్ లో వరుణ్-లావణ్య వివాహం జరుగుతుందని టాక్ వచ్చింది. అయితే వీరి వివాహం ఈ ఏడాది నవంబర్ లేదా డిసెంబర్ లో చేయనున్నారని ముందుగా వార్తలు వచ్చాయి. కానీ, తర్వాత అది ప్రీపోన్ అయి ఆగస్టు 24న జరగనుందని ఓ న్యూస్ గుప్పుమంది. మళ్లీ ఇప్పుడు వీరి పెళ్లి వాయిదా పడినట్లు తెలుస్తోంది.
కొద్దిరోజుల్లోనే: వరుణ్ తేజ్ చెల్లెలు, మెగా డాటర్ నిహారిక కొణిదెల ఈ మధ్యే విడాకులు తీసుకున్న విషయం తెలిసిందే. విడాకులు తీసుకుని ఎక్కువగా రోజులు గడవలేదు. ఇలా విడాకులు తీసుకున్న కొద్ది రోజుల్లోనే ఇంట్లో శుభకార్యం చేయడం బాగోదని తండ్రి నాగబాబు భావిస్తున్నారట. అలాగే ముహుర్తాలు చూసి వివాహం జరిపించాలని అనుకుంటున్నారట మెగా బ్రదర్.

ముందు నెలల్లోనే: అయితే నిహారిక ప్రస్తుతం ఫ్రెండ్స్ తో వెకేషన్ ఎంజాయ్ చేస్తోంది. ఆమె డిప్రెషన్ నుంచి బయటపడేందుకే టూర్స్ కు వెళ్తుందని అంటున్నారు. కూతురు బాధలో ఉన్నప్పుడు కొడుకు పెళ్లి తేదిని తండ్రి నాగబాబు మార్చారని టాక్. ఇలా ముందుగా అనుకున్నట్లే వరుణ్, లావణ్యల పెళ్లి నవంబర్, డిసెంబర్ లో జరగనున్నట్లు తెలుస్తోంది. మరి ఈ వార్తల్లో ఎంతనిజముందో తెలియాలి.


Click it and Unblock the Notifications











