Varun Tej Lavanya: వరుణ్ లావణ్య పెళ్లికి రేణ్ దేశాయ్ డుమ్మా.. మెగా ఫ్యామిలీ రిటర్న్ గిఫ్ట్ ఏంటో తెలుసా?
మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠి.. మూడు ముళ్ల బంధంతో ఒక్కటైన సంగతి తెలిసిందే. ఇక వీరి పెళ్లి నవంబర్ 1వ తేదీన ఇటలీలో ఘనంగా జరిగింది. అయితే వీరి పెళ్లికి పవన్ కల్యాణ్ మాజీ భార్యను ఆహ్వానించారు అంటూ అప్పట్లో కథనాలు వచ్చాయి. అయితే ఆమె పెళ్లికి రాను అని చెప్పిందని కూడా నెట్టింట హల్ చల్ చేసిన విషయం తెలిసిందే. అయితే తాజాగా వరుణ్ తేజ్, లావణ్యల పెళ్లికి రాకపోయినా రేణు దేశాయ్ కు మెగా ఫ్యామిలీ భారీ గిఫ్టును పంపారట. ఆ వివరాల్లోకి వెళితే....
ఇటీవల నవంబర్ 1వ తేదీన ఇటలీలో వరుణ్ తేజ్, లావణ్యల పెళ్లి ఘనంగా జరిగింది. ఇక వీరి ప్రేమకు ఇరు పెద్దలు ఒప్పకోగా.. ఇటలీలో డెస్టినేషన్ వెడ్డింగ్ చేశారు. ఈ వేడుకకు మెగా ఫ్యామిలీ, త్రిపాఠి ప్యామిలీ, అల్లు ఫ్యామిలీ హాజరు అయ్యారు. ఇక ఇండస్ట్రీలోని సన్నిహితులు సైతం వచ్చి నూతన వధువరులను ఆశీర్వాదించారు. ఇక నిన్న హైదరాబాద్ లో పెళ్లికి రాని వారందరికీ మెగా ఫ్యామిలీ రిసెప్షన్ ఏర్పాటు చేసింది. ఇక ఈ వేడుకకు సినీ ఇండస్ట్రీలోని ప్రముఖులు హాజరు అయి వారిని ఆశీర్వదించారు..

ఇక పవన్ కల్యాణ్ మాజీ భార్య రేణు దేశాయ్ ను ఈ పెళ్లికి రావాలని పిలిచారట. అయితే ఆమె పెళ్లికి రాలేను అంటూ చెప్పుకువచ్చిందని తెలుస్తోంది. వరుణ్ తేజ్ వరుసకు కొడుకు అవుతాడనే విషయం తెలిసిందే. అయితే అక్కడ పవన్ కల్యాణ్, అతని భార్య ఉంటారు.. వారి మధ్యలో నేను కనబడటం శ్రేయాస్కరం కాదు అంటూ తిరస్కరించదని వార్తలు వచ్చాయి. ఇక వరుణ్ పెళ్లికి రేణు దేశాయ్ పోలేదు.

ఇక నిన్న జరిగిన రిసెప్షన్ కు కూడా రేణు దేశాయ్ కానీ.. ఆమె పిల్లలు అకీరా, ఆధ్య కానీ పోలేదు. అయితే పెళ్లికి, రిసెప్షన్ కు రాకపోయినా... మెగా ఫ్యామిలీ ఆమె కోసం భారీ గిఫ్టును పంపించారట. మెగా ఫ్యామిలీ నుంచి వెళ్లాల్సిన సంప్రదాయం మాత్రం ఆమెకు వెళ్లిపోయిందని తెలుస్తోంది. నాగాబాబు కొడుకు పెళ్లి సందర్భంగా మెగా ఫ్యామిలీలోని అందరికీ భారీ స్థాయిలో మర్యాదలు చేశారని తెలుస్తోంది.

అందులో భాగంగానే.. రేణు దేశాయ్ కు కూడా భారీ గిఫ్టును పంపించారట. అందరికీ పట్టు వస్త్రాలతో పాటు గోల్డ్ ఐటమ్స్ ను గిఫ్ట్ చేశారని టాక్. ఈ క్రమంలోనే మెగా ఇంటి మాజీ కోడలైన రేణు దేశాయ్ కి కూడా పట్టు వస్త్రాలతో పాటు గోల్డ్ గిఫ్ట్ అలాగే... ఆధ్యాకు అకిరాకు బట్టలు పంపించారని టాలీవడ్ వర్గాల సమాచారం. ఇక ఈ న్యూస్ నెట్టింట వైరల్ గా మారింది.


Click it and Unblock the Notifications











