Varun Tej: లావణ్యతో లవ్ సీక్రెట్స్ లీక్ చేసిన వరుణ్ తేజ్.. అబ్బో ఇంత జరిగిందా!
మెగా బ్రదర్ నాగ బాబు తనయుడు వరుణ్ తేజ్ త్వరలోనే ఓ ఇంటివాడు కాబోతున్న సంగతి తెలిసిందే. ఆయన తన బ్యాచిలర్ లైఫ్ కు త్వరలోనే ఎండ్ కార్డ్ వేయనున్నారు. హీరోయిన్ లావణ్య త్రిపాఠితో కలిసి త్వరలో పీటలెక్కబోతున్నాడు. ఇక లావణ్యతో ప్రేమలో పడ్డ ఈ హీరో... తాజాగా తన ప్రేమ సీక్రెట్స్ రివిల్ చేశారు. లావణ్యతో ప్రేమలో ఎలా పడ్డారో చెప్పిన వరుణ్... లవ్ సీక్రెట్స్ బయట పెట్టారు. ఆ వివరాల్లోకి వెళితే...
మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్... మెగా కాంపౌండ్ నుంచి వచ్చినప్పటికీ తనకంటూ ఒక ప్రత్యేకమైన క్రేజ్ ను సంపాదించుకున్నారు. ముకుంద సినిమాతో టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చిన వరుణ్ తేజ్... ఆ తర్వాత క్రిష్ దర్శకత్వంలో కంచె అనే సినిమా చేశాడు. ఇక ఈ సినిమాతో తన సత్తా ఏంటో నిరూపించుకున్నాడు వరుణ్ తేజ్. ఈ సినిమాలో వరుణ్ తేజ్ నటనకు చాలామంది ఫిదా అయిపోయారు. ఇక వరుస సినిమాలతో దూసుకెళ్తున్న వరుణ్ తేజ్... టాలీవుడ్ హీరోయిన్ లావణ్య త్రిపాఠి తో ప్రేమలో పడిపోయారు.

టాలీవుడ్ హీరోయిన్, సొట్టబుగ్గల సుందరి హీరోయిన్ లావణ్య త్రిపాఠితో వరుణ్ తేజ్ త్వరలోనే పెళ్లి పీటలు ఎక్కబోతున్న సంగతి తెలిసిందే. వీరిద్దరూ ఓ త్వరలోనే ఓ ఇంటివారు కాబోతున్నారు. లావణ్, వరుణ్ తేజ్ లు కలిసి నటించిన చిత్రాలు మిస్టర్, అంతరిక్షం. ఈ సినిమాల్లో వీరిద్దరూ జంటగా నటించారు. ఈ సినిమా ద్వారా ఏర్పడ్డ పరిచయం ప్రేమగా మారిందని తెలుస్తోంది.
చాలా ఏళ్ల నుంచి సీక్రెట్ గా లవ్ చేసుకుంటున్న వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠి.. ఫైనల్ గా పెద్దలను ఒప్పించారు. ఇక త్వరలోనే ఒకటి అవ్వాలని నిర్ణయించుకున్నారు. ఇటీవల నాగబాబు నివాసంలో వీరి ఎంగైజ్మెంట్ కూడా జరిగింది. ఈ వేడుకకు మెగా కుటుంబం, సినీ ప్రముఖులు మాత్రమే హాజరు అయ్యారు. ఈ ఏడాది చివర్లో వీరు వరుణ్ తేజ్, లావణ్యలు పెళ్లి జీవితంలోకి అడుగు పెట్టబోతున్నారు.
ప్రస్తుతం వరుణ్ తేజ్ తన తాజా చిత్రం గాండీవధారి అర్జున ప్రమోషన్స్ లో బిజీగా ఉన్నాడు. ఈ సినిమాకు ప్రవీణ్ సత్తారు దర్శకత్వం వహించారు. ఇక వరుణ్ కు జోడికి సాక్షి వైద్య హీరోయిన్ గా నటించింది. ఈ సినిమాను బీఏవీఎన్ఎస్ ప్రసాద్ నిర్మించారు. ఇక ఈ యాక్షన్ థ్రిల్లర్.. ఆగస్టు 25వ తేదీన రిలీజ్ కానుంది. ఇప్పటికే విడుదలైన ట్రైయిల్ ఆకట్టుకుంటుంది. ఈ సినిమా హాలీవుడ్ రేంజ్ ను తలపిస్తోందని తెలుస్తోంది.

ఇక గాండీవధారి అర్జున చిత్ర ప్రమోషన్స్ పాల్గొన్న వరుణ్ తేజ్... సినిమాకు సంబంధించి ఎన్నో విషయాలు పంచుకున్నారు. అలాగే లావణ్యతో లవ్ గురించి కూడా ఆసక్తికర కామెంట్స్ చేశాడు. లావణ్యతో నా లవ్ స్టోరీ మొదలై 5 ఏళ్లు దాటిపోయిందన్నారు. తామిద్దరం ప్రేమలో పడటానికి మెయిన్ కారణం మా అభిప్రాయాలు కలవడమేనని చెప్పుకొచ్చాడు. తనకు ఉన్న బెస్ట్ ఫ్రెండ్స్ లో లావణ్య త్రిపాఠి ఒకరు అని చెప్పుకొచ్చారు.
వరుణ్ తేజ్ మాట్లాడుతూ.... లావణ్యకు నేనే ఫస్ట్ ప్రపోజ్ చేశాను. ఇంట్లో మా ప్రేమ గురించి చెప్పగానే ఒప్పుకున్నారు. అయితే పర్సనల్ విషయాలు నేనెప్పుడూ సీక్రెట్ గా ఉంచడానికే ట్రై చేస్తాను. అందుకే లవ్ గురించి చెప్పలేదు. ఇక లావణ్య చాలా కేరింగ్ పర్సన్. మెచ్చూర్డ్‌గా ఆలోచిస్తుంది. నాకు ఏం కావాలో తనకు బాగా తెలుసు. ఇప్పటికే చాలా గిఫ్ట్స్ ఇచ్చింది. నేనిప్పుడు వాడుతున్న ఫోన్ కూడా ఆమె నుంచి వచ్చిందే అంటూ వరుణ్ ఎన్నో సీక్రెట్స్ ను లీక్ చేసేశారు. దీంతో ఈయన కామెంట్స్ కాస్త నెట్టింట వైరల్ గా మారాయి.


Click it and Unblock the Notifications











