వరుణ్ తేజ్ స్పేస్ సినిమా విడుదల అప్పుడేనా!
మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ కెరీర్ పరంగా మంచి జోరు మీద ఉన్నాడు. ప్రస్తుతం వరుణ్ తేజ్ రెండు చిత్రాలతో బిజీగా గడుపుతున్నాడు. సంకల్ప్ రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కుతున్న స్పేస్ థ్రిల్లర్ చిత్రం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోంది. ఇక అనిల్ రావిపూడి దర్శకత్వంలో వెంకటేష్ తో నటించే మల్టీస్టారర్ చిత్రం ఎఫ్2 కూడా ఈ మధ్యనే ప్రారంభం అయింది.
సంకల్ప్ రెడ్డి దర్శకత్వంలోని చిత్రం ఇప్పటికే రెండు షెడ్యూల్స్ పూర్తి చేసుకోవడం విశేషం. ఈ చిత్రాన్ని డిసెంబర్ 21 న క్రిస్మస్ హాలీడేస్ నేపథ్యంలో విడుదల చేసేందుకు సన్నాహకాలు జరుగుతున్నట్లు వార్తలు వస్తున్నాయి. విడుదల తేదీపై చిత్ర యూనిట్ అధికారికంగా ప్రకటించాల్సి ఉంది.

బాలీవుడ్ బ్యూటీ అదితి రావు హైదరి ఈ చిత్రంలో హీరోయిన్ గా నటిస్తోంది. లావణ్య త్రిపాఠి కూడా మరో హీరోయిన్ గా కీలకపాత్రలో నటించనుంది. ఘాజి విజయం తరువాత సంకల్ప్ రెడ్డి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంపై అంచనాలు పెరిగాయి.


Click it and Unblock the Notifications











