మరో దర్శకుడికి గ్రీన్ సిగ్నల్ ఇవ్వబోతున్న వరుణ్ తేజ్
టాలీవుడ్ మెగా హీరో వరుణ్ తేజ్ బ్యాక్ టూ బ్యాక్ హిట్స్ తో తన మార్కెట్ ను పెంచుకుంటున్న విషయం తెలిసిందే. వీలైనంత వరకు డిఫరెంట్ గా ఉండేలా కథలను ఎంచుకుంటున్న మెగా ప్రిన్స్ ప్రస్తుతం F3 తో పాటు గని అనే సినిమా చేస్తున్నాడు. బాక్సింగ్ నేపథ్యంలో తెరకెక్కుతున్న గని సినిమాపై అంచనాలు ఏ రేంజ్ లో ఉన్నాయో స్పెషల్ గా చెప్పనవసరం లేదు.
ఆ సినిమా కోసం వరుణ్ తేజ్ సరికొత్త ఫిట్నెస్ తో కనిపించనున్నట్లు పోస్టర్స్ ద్వారా క్లారిటీ ఇచ్చేశారు. ఇక నెక్స్ట్ మరో రెండు కథలపై చర్చలు జరుపుతున్న వరుణ్ ఒక దర్శకుడు చెప్పిన కథపై ఫుల్ కాన్ఫిడెన్స్ తో ఉన్నట్లు తెలుస్తోంది. ఆ దర్శకుడు మరెవరో కాదు. ఛలో, భీష్మ సినిమాలతో బాక్సాఫీస్ హిట్ అందుకున్న వెంకీ కుడుముల. అతను చెప్పిన మాస్ యాక్షన్ స్టోరీ వరుణ్ కు బాగా నచ్చేసిందట.

అసలైతే వెంకీ గత కొన్నాళ్లుగా మీడియం హీరోలు అని కాకుండా అగ్ర హీరోలపైనే ఎక్కువగా ఫోకస్ పెట్టాడు. ఇప్పటికే మహేష్ బాబు, రామ్ చరణ్ వంటి స్టార్స్ కు కథలు కూడా చెప్పాడు. కానీ ఎందుకో మరి వాళ్ళతో సెట్టవ్వలేదు. ఇప్పటికే మైత్రి మూవీ మేకర్స్ కు కమిట్మెంట్ ఇచ్చిన ఈ దర్శకుడు వరుణ్ తేజ్ తో న్యూ ప్రాజెక్ట్ ను వారి సంస్థలోనే తెరకెక్కించే అవకాశం ఉన్నట్లు సమాచారం.


Click it and Unblock the Notifications











