వరుణ్ తేజ్ నెక్స్ట్ మూవీ.. క్రేజీ కాంబినేషన్, బ్లాక్ బస్టర్ పక్కా!
మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ వరుస చిత్రాలతో దూసుకుపోతున్నాడు. వరుణ్ తేజ్ నటిస్తున్న రెండు చిత్రాలు ఇప్పటికే సెట్స్ పై ఉన్నాయి. కెరీర్ ఆరంభంలో కుదురుకోవడానికి సమయం తీసుకున్నా ఇప్పుడు మాత్రం మెగా ప్రిన్స్ జోరు చూపిస్తున్నారు. ఫిదా, తొలి ప్రేమ చిత్రాలు సూపర్ హిట్ కావడంతో వరుణ్ తేజ్ క్రేజీ హీరోగా మారిపోయాడు. వరుణ్ తేజ్ నెక్స్ట్ మూవీ పై ఆసక్తికరమైన వార్తలు ప్రచారం జరుగుతున్నాయి.

గీత గోవిందంతో మోత
శ్రీరస్తు శుభమస్తు చిత్రంతో తనకంటూ గుర్తింపు తెచ్చుకున్న దర్శకుడు పరశురామ్ గీత గోవిందం చిత్రంతో మోత మోగిస్తున్నాడు. గీత గోవిందం చిత్రం బ్లాక్ బస్టర్ వసూళ్లతో దూసుకుపోతోంది. యువతని ఆకట్టుకునేలా సన్నివేశాలు చిత్రీకరించడంతో పరశురామ్ తన ప్రతిభ చూపిస్తున్నాడు.

క్రేజీ డైరెక్టర్
గీత గోవిందం చిత్రంతో పరశురామ్ క్రేజీ డైరెక్టర్ గా మారిపోయాడు. పరశురామ్ తదుపరి చిత్రాల విషయంలో ఆసక్తికరమైన వార్తలు వస్తున్నాయి. పరశురామ్ తదుపరి చిత్రం కూడా గీతా ఆర్ట్స్ బ్యానర్ లోనే అని వార్తలు వినిపిస్తున్నాయి.

వరుణ్ తేజ్‌తో
పరశురామ్ తదుపరి మెగా ప్రిన్స్ వరుణ్ ని డైరెక్ట్ చేయబోతున్నాడని ఈ చిత్రం గీత ఆర్ట్స్ బ్యానర్ లో నిర్మాణం జరుగుతుందని వార్తలు వస్తున్నాయి. వరుణ్ తేజ్ ప్రస్తుతం ఎఫ్ 2, అంతరిక్షం చిత్రాలలో నటిస్తున్నాడు. ఈ చిత్రాలు పూర్తయ్యాక వరుణ్ తేజ్ మూవీ ప్రారంభం అయ్యే అవకాశం ఉంది.

మైత్రి మూవీస్
మరోవైపు భారీ చిత్రాల నిర్మాణ సంస్థ మైత్రి మూవీస్ కూడా పరశురామ్, వరుణ్ తేజ్ ప్రాజెక్ట్ లో భాగం కానుందని అంటున్నారు. గీత గోవిందం హడావిడి కాస్త తగ్గాకా ఈ విషయాల్లో క్లారిటీ వచ్చే అవకాశం ఉంది.


Click it and Unblock the Notifications











