వరుణ్ తేజ, పూరి చిత్రం లేటెస్ట్ ఇన్ఫో

By Srikanya

హైదరాబాద్ : ముకుంద చిత్రంతో పరిచయమైన హీరో వరుణ్ తేజ తన తాజా చిత్రం కంచె షూటింగ్ లో రెగ్యులర్ గా పాల్గొంటున్నారు. ఇప్పుడు ఆయన పూరి జగన్నాథ్ చిత్రంలోనూ చేయటానికి రంగం సిద్దం చేసుకుంటున్నారు. జూన్ లో ఈ చిత్రం ప్రారంభమై... రెగ్యులర్ షూట్ కంటిన్యూగా జరుగుతుంది. సి కళ్యాణ్ ఈ చిత్రాన్ని సమర్పిస్తారు. సికె ఎంటర్టైన్మెంట్స్, శ్రీ సుధ స్వేత ఫిల్మ్స్ వారు తమ ప్రొడక్షన్ నెంబర్ 2 గా దీన్ని నిర్మిస్తారు.

అసలు...మొదట పూరి దర్శకత్వంలోనే వరుణ్ తేజ లాంచింగ్ అనుకున్నారు. కానీ రకరకాల కారణాలతో ఆ ప్రాజెక్టు ముందుకు వెళ్లలేదు. తర్వాత ప్రాజెక్టు అయినా మొదలెడదాముకునే పూరి చాలా బిజీగా ఉన్నారు. దాంతో మూడో ప్రాజెక్టుగా వీరి కాంబినేషన్ పట్టాలు ఎక్కుతోంది.

వరుణ్ తేజ తాజా చిత్రం కంచెం విషయానికి వస్తే..

డైరక్టర్ క్రిష్ దర్శకత్వంలో వరుణ్ తేజ హీరోగా నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రానికి కంచె అనే టైటిల్ ని ఫైనలైజ్ చేసి లాంచ్ చేసారు. ఇది పీరియడ్ డ్రామా. స్వాతంత్ర్యానికి ముందు జరిగిన కథతో ఈ చిత్రం తెరకెక్కుతోంది. ఈ సినిమాలో ప్రజ్ఞ జైస్వాల్ హీరోయిన్ గా ఎంపికయ్యింది. మిస్ ఇండియా కాంటెస్ట్ లో పార్టిసిపేట్ చేసిన ప్రజ్ఞ జైస్వాల్, తెలుగులో అభిజిత్ సరసన ‘మిర్చి లాంటి కుర్రాడు' సినిమాలో నటిస్తుంది.

ఫేస్‌బుక్ ద్వారా లేటెస్ట్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు

‘టిట్టో ఎంబిఏ', ‘విరాట్టు', ఇండో - కెనడియన్ ఫిల్మ్ ‘ఎ లిటిల్ హెవెన్ ఇన్ మీ'లో నటించింది. ఆయా సినిమాలలో ఆమె నటన చూసి దర్శకనిర్మాతలు ఇంప్రెస్ అయ్యారు. వెంటనే ఈ సినిమాలో అవకాశం ఇచ్చారు అని యూనిట్ వర్గాలు తెలిపాయి.

Varun Tej-Puri Jagannath's film from

ఈ సినిమా ముహూర్త కార్యక్రమం ఫిబ్రవరి 27న జరుగి రెగ్యులర్ షూటింగ్ జరుపుకుంటోంది. రాజీవ్ రెడ్డి ఈ సినిమాకు నిర్మాత. తాజాగా ఈ సినిమాకు సంబంధించి మరో ఆసక్తికరమైన అంశం వెలుగులోకి వచ్చింది.

రెండవ ప్రపంచ యుద్ధ నేపధ్యంలో ఈ సినిమా కథ ఉంటుందట. పీరియాడికల్ డ్రామాగా రూపొందబోయే ఈ సినిమాలో వరుణ్ తేజ్ ఇండియన్ ఆర్మీ సోల్జర్ గా నటిస్తున్నాడని ఫిల్మ్ నగర్ టాక్.

తొలి సినిమాతోనే మంచి పేరు, గుర్తింపు తెచ్చుకున్నాడు వరుణ్ తేజ్. దీనికి తోడే మెగా ఫ్యామిలీ ఫ్యాన్స్ అండ ఉండనే ఉంది. అందుకే రెండో సినిమాకే రెమ్యూనరేషన్ రూ. 3 కోట్లు తీసుకుంటున్నాడట. దీని తర్వాత మరో చిత్రం పూరి జగన్నాథ్ దర్శకత్వంలో చేయబోతున్నాడు. పూరి జగన్నాథ్ సినిమాను సి. కళ్యాణ్ నిర్మించబోతున్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X