ఎన్టీఆర్ బయోపిక్ రిజెక్ట్ చేసిన మెగా హీరో.. తీవ్రమైన వ్యతిరేకత నిజమేనా!
ఎన్టీఆర్ బయోపిక్ చిత్రంపై ఆడియన్స్ లో రోజు రోజుకు ఆసక్తి పెరుగుతోంది. ఈ చిత్రంలో ప్రముఖల పాత్రల ఎంపిక కోసం దర్శకుడు ఆచితూచి అడుగులు వేస్తున్నాడు. ఆయా పాత్రలకు దారిపడే నటీనటులని ఎంపిక చేసుకుంటున్నాడు. ఇప్పటివరకు క్రిష్ ఎంపిక చేసిన కాస్టింగ్ కరెక్ట్ అని ఒప్పుకోవాల్సిందే. గత కొన్ని రోజుల నుంచి ఈ చిత్రంలో మెగాస్టార్ చిరంజీవి రోల్ కోసం మెగా హీరోనే దర్శకుడు క్రిష్ ఎంపిక చేసుకున్నాడని వార్తలు వస్తున్నాయి. ఈ విషయంలో క్రిష్ కు నిరాశ ఎదురైనట్లు తెలుస్తోంది.

మెగాస్టార్‌గా వరుణ్ తేజ్
మెగాస్టార్ చిరంజీవికి, ఎన్టీఆర్ కు సాన్నిహిత్యం ఉంది. వీరిద్దరూ కలసి నటించారు కూడా. దీనితో ఎన్టీఆర్ బయోపిక్ చిత్రంలో చిరు పాత్ర కూడా ఉండాలని క్రిష్ భావించాడు. చిరు పాత్ర కోసం క్రిష్ మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ ని సంప్రదించినట్లు తెలుస్తోంది.
Recommended Video


రిజెక్ట్ చేసిన వరుణ్
క్రిష్ ప్రపోజల్ కు వరుణ్ తేజ్ నో చెప్పినట్లు వార్తలు వస్తున్నాయి. యంగ్ మెగాస్టార్ గా వరుణ్ తేజ్ సరిపోతాడని క్రిష్ భావించాడు. వరుణ్ నిర్ణయంతో క్రిష్ నిరాశ చెందినట్లు తెలుస్తోంది. చాలా మంది నటులు ఎన్టీఆర్ బయోపిక్ లో నటించాలని ఆసక్తి చూపుతున్న తరుణంలో వరుణ్ ఈ ఆఫర్ ఎందుకు వదిలేశాడే చర్చ జరుగుతోంది.

కారణం అదేనా
వరుణ్ తేజ్ ఎన్టీఆర్ బయోపిక్ లో నటిస్తున్నాడని వార్తలు రాగానే మెగా ఫాన్స్ నుంచి వ్యతిరేకత మొదలైనట్లు తెలుస్తోంది. ఈ చిత్రం నుంచి దూరంగా ఉండాలి కూడా వరుణ్ కు కొందరు సూచించినట్లు తెలుస్తోంది. అభిమానుల మధ్య అనవసరమైన వివాదాలు చెలరేగే ప్రమాదం ఉండడంతో వరుణ్ తేజ్ ఈ చిత్రాన్ని రిజెక్ట్ చేసినట్లు తెలుస్తోంది.

మరో కారణం
మరోవైపు వరుణ్ తేజ్ వరుస చిత్రాలతో బిజీగా మారుతున్నాడు. ఇప్పటికే అంతరిక్షం, ఎఫ్ 2 సినిమాల షూటింగ్ జరుగుతోంది. ఎన్టీఆర్ బయోపిక్ రిజెక్ట్ చేయడానికి ఇది కూడా ఓ కారణం అయి ఉండవచ్చు.


Click it and Unblock the Notifications











