twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    వరుణ్ తేజ్ ఆ దర్శకుడిని పక్కన పెట్టేశాడా.. ఆ తర్వాతే రామ్!

    |

    మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ వరుసగా ప్రయోగాలు చేస్తున్నాడు. వరుణ్ తేజ్ ప్రయోగాల బాట కంచె చిత్రంతోనే మొదలైంది. ఇటీవల అంతరిక్షం చిత్రంలో వ్యోమగామిగా నటించి మెప్పించాడు. ఆ తర్వాత ఎఫ్2 చిత్రంలో వెంకటేష్ తో కలసి కామెడీ పండించాడు. ఇటీవలే హరీష్ శంకర్ దర్శత్వంలో వాల్మీకి చిత్రం ప్రారంభమైంది. ఈ చిత్రంలో వరుణ్ తేజ్ నెగిటివ్ షేడ్స్ ఉన్న పాత్రలో నటించబోతున్నట్లు తెలుస్తోంది. ఇదిలా ఉండగా వరుణ్ తేజ్ చేయాల్సిన చిత్రం మరో హీరో చేతుల్లోకి వెళ్లినట్లు వార్తలు వస్తున్నాయి.

    ముందుగా అనుకున్నది అతడితో

    ముందుగా అనుకున్నది అతడితో

    వరుణ్ తేజ్ ప్రస్తుతం హరీష్ శంకర్ దర్శకత్వంలో వాల్మీకి చిత్రాన్ని ప్రారంభించాడు. వాల్మీకి చిత్రం తమిళ బ్లాక్ బస్టర్ మూవీ జిగర్తాండకు రీమేక్. ఈ చిత్రాన్ని 14 రీల్స్ సంస్థ నిర్మిస్తోంది. వాస్తవంగా వాల్మీకి చిత్రాన్ని 14 రీల్స్ సంస్థ నిర్మించాలని అనుకోలేదట. యువ దర్శకుడు సాగర్ చంద్ర ఆ మధ్యన ఓ కథని వరుణ్ తేజ్ కు వినిపించినట్లు తెలుస్తోంది. అప్పట్లో ఒకడుండేవాడు చిత్రంతో ఈ యువ దర్శకుడు మంచి గుర్తింపు సొంతం చేసుకున్నాడు.

    వరుణ్ తప్పుకున్నాడు

    వరుణ్ తప్పుకున్నాడు

    వరుణ్ తేజ్ కు కూడా సాగర్ చెప్పిన పాయింట్ నచ్చినట్లు తెలుస్తోంది. 14 రీల్స్ సంస్థ ఈ కాంబినేషన్ లోనే సినిమా నిర్మించాలని భావించింది. కానీ కథ డెవలప్ చేసే సమయంలో సరిగా సెట్ కాకపోవడంతో వరుణ్ తప్పుకున్నాడు. వెంటనే హరీష్ శంకర్ కు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో 14 రీల్స్ సంస్థ ఈ ప్రాజెక్ట్ లోకి ఎంటర్ అయిపోయింది.

    రామ్ గ్రీన్ సిగ్నల్

    రామ్ గ్రీన్ సిగ్నల్


    దర్శకుడు సాగర్ చంద్ర అదే కథని హీరో రామ్ కు వివరించాడట. కథ బావుండడంతో రామ్ ఒకే చెప్పినట్లు తెలుస్తోంది. రామ్ పెదనాన్న స్రవంతి రవికిశోర్ ఈ చిత్రాన్ని నిర్మించే అవకాశాలు ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. ప్రస్తుతం రామ్ డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ దర్శత్వంలో ఇస్మార్ట్ శంకర్ చిత్రంలో నటిస్తున్నాడు. ఈ చిత్రం పూర్తయ్యాక సాగర్ చంద్ర దర్శత్వంలోని చిత్రం ప్రారంభమయ్యే అవకాశం కనిపిస్తోంది.

    ఆ విషయంలో

    ఆ విషయంలో

    సాగర్ చంద్ర తెరకెక్కించిన అప్పట్లో ఒకడుండేవాడు, అయ్యారే చిత్రాలకు విమర్శకుల నుంచి ప్రశంసలు లభించాయి. కానీ సాగర్ చంద్ర కమర్షియల్ గా ప్రూవ్ చేసుకోవాలి. రామ్‌తో తెరకెక్కించబోయే చిత్రంతో సాగర్ చంద్ర కమర్షియల్ హిట్ అందుకుంటాడేమో చూడాలి. ఈ ఏడాది ద్వితీయార్థంలో ఈ చిత్రం ప్రారంభం అయ్యే అవకాశాలు ఉన్నాయి.

    English summary
    Varun Tej rejects that director story but Ram gives green signal
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X