నాగబాబు కొడుకు నెక్ట్స్ ఖరారు...పూర్తి డిటేల్స్

By Srikanya

హైదరాబాద్:మెగా బ్రదర్ నాగబాబు కుమారుడు వరుణ్ తేజ ప్రస్తుతం ముకుంద విడుదల కోసం ఎదురుచూస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఒక సినిమా కూడా విడుదల కాకుండానే అతనికి వరస పెట్టి ఆఫర్స్ వస్తున్నాయి. అయితే వరుణ్ తేజ ఆచితూచి అడుగులు వేస్తున్నారు. తన తదుపరి చిత్రాన్ని పూరి జగన్నాథ్ దర్శకత్వంలో చేయనున్నాడని విశ్వసనీయ సమాచారం. సి.కళ్యాణ్ ఈ చిత్రాన్ని నిర్మించనున్నారు. ఈ మేరకు ప్రి ప్రొడక్షన్ వర్క్ జరుగుతోంది. టెంపర్ పూర్తి కాగానే పూరీ ఆ చిత్రం బిజీలో పడిపోతారు. వచ్చే నెలలో ఈ చిత్రం సెట్స్ కు వెళ్లనుంది.

ఇక వరుణ్ తేజ..ముకుంద విషయానికి వస్తే...

వరుణ్‌తేజ్, పూజాహెగ్డే జంటగా నటిస్తున్న చిత్రం ముకుందా. లియో ప్రొడక్షన్స్ పతాకంపై నల్లమలుపు శ్రీనివాస్(బుజ్జి) నిర్మిస్తున్న ఈ చిత్రానికి శ్రీకాంత్ అడ్డాల దర్శకుడు. ఠాగూర్ మధు సమర్పకుడు.

Varun Tej's next with Puri Jagannath

దర్శకుడు చిత్ర విశేషాలు తెలియజేస్తూ... యాక్షన్ అంశాల మేళవింపుతో తెరకెక్కుతున్న ప్రేమకథా చిత్రమిది. పల్లెటూరి అనుబంధాలు, ప్రేమలు, రాజకీయాలు యువతరంపై ఏ విధమైన ప్రభావాన్ని చూపుతున్నాయనే అంశాన్ని ఈ చిత్రంలో చూపిస్తున్నాం. ఎలాంటి అంశాలకు ప్రభావితం కాని ఓ కుర్రాడి జీవితం ప్రేమ కారణంగా ఎన్ని మలుపులు తిరిగింది అనేది ఆసక్తికరంగా ఉంటుంది.

ఇదివరకు నేను తెరకెక్కించిన చిత్రాలకి భిన్నంగా యాక్షన్‌కి ప్రాధాన్యమిస్తూ ఈ చిత్రాన్ని తీర్చిదిద్దుతున్నా. ప్రతీ సన్నివేశం సహజంగా కనిపించాలని భీమవరం, అమలాపురం, తాడేపల్లిగూడెం, ద్రాక్షారామం, సామర్లకోట తదితర ప్రాంతాల్లో చిత్రీకరణ జరిపాం. యువతరం భావోద్వేగాల్ని ప్రతిబింబిస్తూ సాగే ఈ చిత్రం అందరికీ నచ్చేలా ఉంటుంది. వరుణ్‌తేజ్ నటన, పూజా హెగ్డే గ్లామర్ ఈ సినిమాకు ప్రధాన ఆకర్షణగా నిలుస్తాయి అన్నారు.

నిర్మాత మాట్లాడుతూ ''ఒక చిన్న పట్టణం నేపథ్యంలో సాగే కథ ఇది. ముకుంద అనే ఓ యువకుడి ప్రేమపై స్థానిక పరిస్థితులు ఎలాంటి ప్రభావం చూపించాయి? వాటి నుంచి బయట పడేందుకు అతను ఏం చేశాడు? అనే విషయాలు ఆసక్తికరం. వరుణ్‌తేజ్‌ నటన చిత్రానికి ప్రధాన ఆకర్షణగా నిలుస్తుంది.'' అన్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X