Just In
- 34 min ago
అది మాత్రం కంపల్సరీ అంటూ... గోవాలో రాశీ ఖన్నా రచ్చ
- 58 min ago
మరో నిర్మాత కొడుకును హీరోగా పరిచయం చేస్తున్న శ్రీకాంత్ అడ్డాల.. నారప్ప తరువాత అదే..
- 1 hr ago
‘పుష్ప’ విషయంలో అల్లు అర్జున్ నిర్ణయం మార్పు: సినిమా విడుదల అయ్యేది ఐదు భాషల్లో కాదు!
- 1 hr ago
రొమాన్స్‌లో మునిగితేలారు.. అది అలవాటుగా కాదట.. భర్త ఒళ్లో వాలిన పూజా రామచంద్రన్
Don't Miss!
- Sports
IPL 2021: చెన్నై జట్టులోకి రాబిన్ ఊతప్ప.. మీరు మారరంటూ ఫ్యాన్స్ ఫైర్!
- Automobiles
భారత్‌లో సిట్రోయెన్ మొదటి షోరూమ్ ప్రారంభం, త్వరలో సి5 ఎయిర్‌క్రాస్ విడుదల
- News
అనంత కలెక్టర్‌ను కదిలించిన ఫేస్బుక్ పోస్ట్: 24 గంటల్లోనే బస్సు: స్టూడెంట్స్‌తో కలిసి ప్రయాణం
- Finance
బడ్జెట్ కంటే ముందు ఏ స్టాక్స్ కొంటే లాభాలు వస్తాయి..?
- Lifestyle
ఈ రాశుల వారు పిల్లల్ని బాగా పెంచుతారట... మీ రాశి కూడా ఉందేమో చూసెయ్యండి...!
- Technology
వన్‌ప్లస్ నార్డ్ స్మార్ట్‌ఫోన్ ప్రీ-ఆర్డర్స్ ఇండియాలో జూలై 15 మధ్యాహ్నం 1.30 గంటల నుండి మొదలు
- Travel
కర్ణాటక జూన్ 1 నుండి ఈ ఆధ్యాత్మిక ప్రదేశాలను తెరవనుంది..
వరుణ్ తేజ్ కూడా అదే సెంటిమెంట్ ఫాలోయింగా?
హైదరాబాద్: మెగా ఫ్యామిలీ నుండి నాగ బాబు కొడుకు వరుణ్ తేజ్ కూడా హీరోగా ఇండస్ట్రీకి పరిచయం అయ్యాడు. వరుణ్ తేజ్ నటించిన ‘ముకుంద' చిత్రం ఇటీవల విడుదలై బాక్సాఫీసు వద్ద ఫర్వాలేదు అనిపించుకుంది. సినిమా ఎలా ఉందనే సంగతి పక్కన పెడితే వరుణ్ తేజ్ లుక్స్, పెర్ఫార్మెన్స్ అందరికీ నచ్చింది.
‘ముకుంద' తర్వాత మరో రెండు సినిమాలు ఓకే అయ్యాయి. ఓ చిత్రాన్ని క్రిష్ దర్శకత్వంలో చేయబోతున్నాడు. మరో చిత్రం పూరి జగన్నాథ్ దర్శకత్వంలో చేయబోతున్నాడు. పూరి జగన్నాథ్ సినిమాను సి. కళ్యాణ్ నిర్మించబోతున్నారు. అయితే ముందుగా క్రిష్ దర్శకత్వంలో సినిమా ప్రారంభం అవుతుందని అంటున్నారు.

క్రిష్ దర్శకత్వంలో వరుణ్ తేజ్ చేయబోయే రెండో సినిమా నిర్మాణ బాధ్యతలు క్రిష్, అల్లు అరవింద్ గీతాఆర్ట్స్, డివివి దానయ్య భాగస్వాములుగా ఉంటారని సమాచారం. మెగా హీరోల రెండో సినిమాలో ‘గీతా ఆర్ట్స్' పాలు పంచుకోవడం ఆనవాయితీగా వస్తోంది. రామ్ చరణ్, అల్లు శిరీష్, సాయి ధరమ్ తేజ్ చిత్రాల విషయంలో అదే జరిగింది. ఇపుడు వరుణ్ తేజ్ విషయంలో కూడా ఇదే సెంటిమెంట్ ఫాలోఅవుతున్నారని టాక్.
వరుణ్ తేజ్ తొలి సినిమా ‘ముకుంద' ఆశించిన ఫలితాలు ఇవ్వని నేపథ్యంలో అతని రెండో సినిమా విషయంలో తగిన జాగ్రత్తలు తీసుకుంటున్నాడు నాగబాబు. ఈ సారి సినిమా పూర్తి స్థాయి ఫ్యామిలీ అండ్ మాస్ ఎంటర్టెనర్‌గా రాబోతోందని తెలుస్తోంది.