Varun Tej Lavanya: పెళ్లైన 10 రోజులకే వరుణ్ తేజ్ షాకింగ్ డెసిషన్... లావణ్యకు హ్యాండ్ ఇచ్చాడుగా!
మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్.. ఇటీవల లావణ్యను పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే. ఇక వీరి పెళ్లి ఇటలీలో అంగరంగ వైభవంగా జరిగింది. ఇరు కుటుంబాల మధ్య వీరు డెస్టినేషన్ వెడ్డింగ్ చేసుకున్నారు. ఇదిలా ఉంటే.. పెళ్లై పది రోజులు కాలేదు.. అప్పుడే వరుణ్ తేజ్ షాకింగ్ డెసిషన్ తీసుకున్నారు. వరుణ్ తేజ్ నిర్ణయానికి మెగా ఫ్యాన్స్ కూడా ఫీలవుతున్నారు. అప్పుడే లావణ్యకు హ్యాండ్ ఇచ్చావా అంటూ సోషల్ మీడియాలో కామెంట్స్ వినిపిస్తున్నాయి. ఇక అసలు ఏం జరిగిందో ఈ స్టోరీలో తెలుసుకుందాం.
అందాల రాక్షసి లావణ్య త్రిపాఠి, ఫిదా కుర్రాడు వరుణ్ తేజ్ ఇటీవల ఒక్కటైన సంగతి తెలిసిందే. ఇక వీరు ఐదేళ్లు సీక్రెట్ గా ప్రేమించుకుని.. ఇక ఆ విషయాన్ని ఇంట్లో చెప్పి ఒక్కటైపోయారు. నవంబర్ 1న ఇటలీలో వీరి పూనాది పడిన చోటే.. మూడు ముళ్ల బంధంతో ఏడు అడుగులు వేసి ఓ ఇంటివారయ్యారు. ఇక ఈ వివాహానికి మెగా ఫ్యామిలీ, అల్లు ఫ్యామిలీ, త్రిపాఠి ఫ్యామిలీ హాజరయ్యింది. ఇక వీరితో పాటు.. సినీ పరిశ్రమలో ఉండే సన్నిహితులు కూడా వచ్చారు.

ఇక వీరి పెళ్లి తర్వాత నవంబర్ 5న హైదరాబాద్ లో సినీ ప్రముఖుల కోసం రిసెప్షన్ నిర్వహించారు. ఇక ఈ వేడుకకు సినీ రాజకీయ ప్రముఖులు హాజరు అయ్యారు. ఇక పెళ్లి ఫోటోలు, రిసెప్షన్ ఫోటోలు కూడా బాగా వైరల్ అయ్యాయి. ఇక ఆ ఫోటోస్ చూసిన చాలా మంది మెగా ఫ్యాన్స్ అయితే ఫుల్ ఖుష్ అయ్యారు. ఇక ఇదిలా ఉంటే.. వరుణ్ తేజ్ తీసుకున్న నిర్ణయం తెలుసుని మెగా ఫ్యాన్స్ ఫీల్ అవుతున్నారు. లావణ్యకు హ్యాండ్ ఇవ్వడం కరెక్ట్ కాదంటూ కామెంట్స్ చేస్తున్నారు.

వరుణ్ తేజ్ పెళ్లై 10 రోజులు కూడా కాలేదు. ఇక అప్పుడే వరుణ్ తేజ్ సినిమా షూటింగ్స్ లో పాల్గొనేందుకు వెళ్లారు. అయితే లావణ్యతో హానీమూన్ కి వెళ్లకుండా ఈ టైంలో సినిమాలు ఏంటి అంటూ నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు. ఇక ఈ హీరో ప్రస్తుతం మట్కా, ఆపరేషన్ వాలెంటైన్ చిత్రాల్లో నటిస్తున్నారు. ఇక వరుణ్ తేజ్ కు గత కొంత కాలంగా సినిమాల్లో కలిసి రావడం లేదు. చివరిసారిగా గాంఢివదారి అర్జున సినిమాలో నటించాడు. ఇక ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద బోల్తా కొట్టింది.
ఇక పెళ్లి తర్వాత ఫుల్ రిఫ్రేష్ తో సినిమాలు చేయాలని డిసైడ్ అయ్యాడు. ఈ సారి ఎలాగైనా హిట్టు కోట్టాల్సిందే అంటూ నిర్ణయించుకున్నారట. ఇక లావణ్య కూడా మెగా ఇంట్లో అడుగుపెట్టింది. దీంతో ఆమె అదృష్టం కూడా తోడై.. వరుణ్ తేజ్ కు కలిసి వస్తుందని ఫ్యాన్స్ అనుకుంటున్నారు. ఇక ఈ సినిమాల షూటింగ్స్ లో పాల్గొనే బిజీలో పడిపోయాడు వరుణ్ తేజ్. మట్కా, ఆపరేషన్ వాలైెంటన్ సినిమాల్లో నటిస్తూ.. బిజిగా మారిపోయాడు.

ప్రస్తుతం ఆపరేషన్ వాలంటైన్ చిత్రం పోస్ట్ ప్రొడక్షన్ పనులు ముంబయిలో జరుపుకుంటుంది. ఇక దీనికోసం ముంబై వెళ్తూ కనిపించాడు వరుణ్ తేజ్. అయితే పెళ్లి తర్వాత హనీమూన్ కోసం భార్యతో వెళ్లాల్సిన వరుణ్.. ఇలా ఒక్కడే కనిపించడంతో మెగా ఫాన్స్ హర్ట్ అయిపోతున్నారు. భార్యతో సరదాగా తిరగకుండా ఇప్పుడు సినిమాలు ఎందుకు అంటూ కామెంట్స్ చేస్తున్నారు.


Click it and Unblock the Notifications











