శ్రీను వైట్లకి వరుణ్ తేజ్ షాక్, ఆ సినిమా సంగతేంటి?
హైదరాబాద్: శ్రీను వైట్లకు ఇప్పటి వరకు ఇద్దరు మెగాహీరోలతో పని చేసే అవకాశం వచ్చింది. అందులో తొలి అవకాశం ఏకంగా మెగాస్టార్ చిరంజీవితో వచ్చినా హిట్ ఇవ్వలేక పోయారు. తర్వాత రామ్ చరణ్ తో 'బ్రూస్ లీ' తీసి పెద్ద ప్లాపే ఇచ్చారు. ఇందులో చిరంజీవితో గెస్ట్ రోల్ చేయించినా బాక్సాఫీసు వద్ద పెద్దగా వర్కౌట్ కాలేదు.
ఈ మధ్య వరుస ప్లాపులైనా శ్రీను వైట్ల మొత్తానికి మరో మెగా హీరో వరుణ్ తేజ్ తో చేసే అవకాశం దక్కించుకున్నాడు. రొమాంటిక్ ఎంటర్టెనర్ గా తెరకెక్కే ఈ సినిమాకు 'మిస్టర్' అనే టైటిల్ కూడా ఫిక్స్ చేసారు. ఈ సినిమా ఆల్రెడీ ప్రారంభోత్సవం కూడా జరుపుకుంది.

ఈ సినిమాకు సంబందించని తొలి షెడ్యూల్ మే నెల చివర్లో స్పెయిన్ లో ప్లాన్ చేసారు. తర్వాత సెకండ్ షెడ్యూల్ బ్రెజిల్ లో చేయాలని నిర్ణయించారు. అయితే ఈ సినిమా ప్రస్తుతానికి వాయిదా పడ్డట్లు సమాచారం. వరుణ్ తేజ్ ఆ సినిమాను పక్కన పెట్టి ముందుగా శేఖర్ కమ్ముల దర్శకత్వంలో సినిమా చేయాలని నిర్ణయించుకున్నాడు.
అయితే ఫిల్మ్ నగర్ నుండి అందుతున్న సమాచారం ప్రకారం 'మిస్టర్' సినిమా స్క్రిప్టుపై వరుణ్ తేజ్ సంతృప్తిగా లేడని, సెకండాఫ్ అతనికి నచ్చలేదని, అందులో మార్పులు చేయాలని శ్రీను వైట్లను కోరినట్లు సమాచారం. మార్పులు చేసిన తర్వాత నచ్చితేనే సినిమా చేస్తానని, లేకంటే లేదని తేల్చి చెప్పాడట.


Click it and Unblock the Notifications











