పూరీ-నాగబాబు కొడుకు చిత్రం టైటిల్
నాగబాబు తనయుడు వరుణ్‌తేజ్ ఎంట్రీ కోసం అభిమానులు, ఇండస్ట్రీ మొత్తం ఎదురుచూస్తున్న సంగతి తెలిసిందే. ఈ ఎంట్రీని గ్రాండ్ గా చేయాలని మెగా ఫ్యామిలీ సైతం ప్లాన్ చేస్తోంది. ఈ నేఫద్యంలో ఈ తొలి చిత్రానికి దర్శకుడుగా శ్రీకాంత్ అడ్డాలను ఎన్నుకున్నట్లు వార్తలు వచ్చాయి. అయిత ఇప్పుడు సీన్ లోకి పూరీ జగన్నాథ్ వచ్చారు.
వరుణ్ తేజ్ ను పూరి జగన్నాథ్ చేతులమీదుగానే హీరోగా పరిచయం చేయాలని మెగా ఫ్యామిలీ ప్లాన్. చిరుతతో రామ్ చరణ్ ని ఘనంగా లాంచ్ చేయటంతో ఈ అవకాసం సైతం పూరీకే అప్పచెప్తున్నట్లు చెప్తున్నారు. ఇక ఈ సినిమాను వైజయంతీ మూవీస్ పతాకంపై సి.అశ్వనీదత్ నిర్మిస్తారని సమాచారం. స్టార్ హీరోల తనయుుల్ని హీరోలుగా పరిశ్రమకు పరిచయం చేయడంలో అశ్వనీదత్‌ది ఘనమైన చరిత్ర.
అశ్వనీదత్ ది గోల్డెన్ హ్యాండ్ అని,ఆయన బ్యానర్ ద్వారా లాంచ్ అయితే కెరిర్ లో సెటిల్ అవ్వచ్చనే ఓ స్ట్రాటజీతో ముందుకు వస్తున్నట్లు తెలుస్తోంది. గతంలో అశ్వనీద్ తన బ్యానర్ ద్వారా మహేష్ బాబు, రామ్ చరణ్ తేజలను పరిచయం చేసారు. మహేష్ తో రాజకుమారుడు, రామ్ చరణ్ తో చిరతగా ఆ చిత్రాలు భాక్సాఫీస్ లను పలకరించాయి. సినిమా రిజల్ట్ లు యావరేజ్ గా ఉన్నా వారు మాత్రం స్టార్స్ గా సెటిల్ అయ్యిపోయారు.


Click it and Unblock the Notifications












