twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    వరుణ్ తేజ్ పాన్ ఇండియా మూవీ.. పాకిస్తాన్ ను దెబ్బకొట్టిన రియల్ ఆర్మీ కథతో..

    |

    తెలుగు చిత్ర పరిశ్రమలో డిఫరెంట్ గా సినిమాలు చేసే హీరోలలో వరుణ్ తేజ్ ఒకరు. మెగా హీరోలు అందరూ కూడా ఎవరికి వారు నచ్చినట్లుగా ఎక్కువగా కమర్షియల్ సినిమాలు చేస్తున్న విషయం తెలిసిందే. కానీ వరుణ్ తేజ మాత్రం అందరికంటే భిన్నంగా అడుగులు వేస్తున్నాడు. అతను సెలెక్ట్ చేసుకుంటున్న ఫిఫరెంట్ కథలు బాక్సాఫీస్ వద్ద అప్పుడప్పుడు నిరాశపరుస్తున్నప్పటికీ కూడా అతని ప్రయత్నాలకు మంచి ప్రశంసలు అందుతున్నాయి. ఇక వరుణ్ మొదటి సారి పాన్ ఇండియా ప్రాజెక్ట్ చేసేందుకు కూడా అడుగులు వేస్తున్నట్లు తెలుస్తోంది. అది కూడా 2019 బాల్ కోట్ వైమానిక దాడి నేపథ్యంలో ఉండబోతోందట.

    అపజయాలు వచ్చినా..

    అపజయాలు వచ్చినా..

    ముకుంద సినిమాతో హీరోగా కెరీర్ స్టార్ట్ చేసిన వరుణ్ తేజ్ దాదాపు అన్ని రకాల సినిమాలను చేసేందుకు ఆసక్తిని చూపించినట్లుగా అతను సెలెక్ట్ చేసిన కథలను చూస్తుంటే అర్ధం అవుతుంది. మొదట్లో వరుస పరాజయాలు ఎదురైనప్పటికి కూడా వరుణ్ తేజ ఆ తర్వాత విభిన్నంగానే సినిమాలను చేసుకుంటూ వచ్చాడు. మెల్లగా తన బాక్సాఫీస్ రేంజ్ ను కూడా పెంచుకున్నాడు.

    ప్రేక్షకుల్లో నమ్మకం..

    ప్రేక్షకుల్లో నమ్మకం..

    మెగా హీరో వరుణ్ తేజ్ ఆ మధ్యకాలంలో అంతరిక్షం ఒక సినిమా చేసిన విషయం తెలిసిందే. మొదటి స్పేస్ తెలుగు సినిమాగా వచ్చిన అంతరిక్షం అనుకున్నంత సక్సెస్ కాలేకపోయింది. కానీ వరుణ్ తేజ్ భిన్నంగా ప్రయత్నించడంతో అతనికి మంచి ప్రశంసలు వచ్చాయి.. వరుణ్ తేజ్ సినిమాలు చాలా డిఫరెంట్ గా ఉంటాయి అని ప్రేక్షకుల్లో కూడా ఒక నమ్మకం అయితే ఏర్పడింది.

    ఆర్మీ బ్యాక్ డ్రాప్..

    ఆర్మీ బ్యాక్ డ్రాప్..

    ఇక వరుసగా బాక్సాఫీస్ విజయాలతో దూసుకెళుతున్న వరుణ్ తేజ్ మిగతా స్టార్ హీరోల మాదిరిగానే పాన్ ఇండియా రేంజ్ లో సినిమాలు చేయాలని ఆలోచిస్తున్నాడు. గత కొంతకాలంగా అతని కోసం ఒక ఆర్మీ బ్యాక్ డ్రాప్ కథ రెడీ అవుతున్నట్లుగా తెలుస్తోంది. ఆ సినిమాను పాన్ ఇండియా రేంజ్ లోనే తెరపైకి తీసుకు రావాలి అని ప్రత్యేకంగా దర్శకనిర్మాతల తో చర్చలు జరిపినట్లు సమాచారం.

    బాలాకోట్‌ వైమానిక దాడి..

    బాలాకోట్‌ వైమానిక దాడి..

    ఇక ఆ పాన్ ఇండియా కాన్సెప్ట్ మరేదో కాదు. 2019లో పాకిస్తాన్ వికృత చర్యలకు ప్రతి చర్యగా చేసినటువంటి బాల్ కోట్ వైమానిక దాడి నేపథ్యంలో సినిమా రాబోతున్నట్లు గా తెలుస్తుంది. భారత యుద్ధ విమానాలు 2019 ఫిబ్రవరి 26న పాకిస్తాన్‌ లోని బాలాకోట్‌ లో ఉగ్రవాద శిక్షణా శిబిరాలకు వ్యతిరేకంగా బాంబు దాడులు నిర్వహించి ఆ దేశానికి షాక్ ఇచ్చింది. అదే కాన్సెప్ట్ లో సినిమా రానుందట.

    ఆ సినిమాలలో ఒక భారత సైనికుడిగా వరుణ్ తేజ్ పవర్ ఫుల్ పాత్రలో కనిపించబోతున్నట్లు తెలుస్తోంది. గతంలోనూ బాలీవుడ్ ఇండస్ట్రీలో ఈ ఇన్సిడెంట్ ఆధారంగా చేసుకొని సినిమా చేయాలని కొంతమంది హీరోలు ప్రయత్నం చేశారు.

    Recommended Video

    Megastar Chiranjeevi Launches The Trailer Of Sai Dharam Tej’s Republic
     త్వరలోనే అప్డేట్..

    త్వరలోనే అప్డేట్..

    అయితే గత ఏడాది నుంచి వరుణ్ తేజ్ 2019 బాల్ కోట్ వైమానిక దాడి నేపథ్యానికి సంబంధించిన కథ గురించే చర్చలు జరుపుతున్నారట. ఇక ఈ సినిమాలో ఎవరు తెరకెక్కిస్తున్నారు అనే విషయంలో ఇంతవరకు సరైన క్లారిటీ అయితే రాలేదు. ఒక కొత్త దర్శకుడు తెర పైకి తీసుకు వచ్చే అవకాశం ఉన్నట్లు కథనాలు వెలువడుతున్నాయి. ఈ ప్రాజెక్టు విషయంలో త్వరలోనే వరుణ్ తేజ్ నుంచి అధికారికంగా క్లారిటీ రానున్నట్లు సమాచారం.

    English summary
    Varun tej upcoming pan india project based on 2019 balakot airstrike..
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X