కుల వివాదం భయంతో మెగా హీరో

అయితే గొల్లభామ అనేది గడ్డిలో తిరిగే ఓ అందమైన రెక్కల పురుగు కదా,దాన్ని దృష్టిలో పెట్టుకుని టైటిల్ అనుకున్నాం అని దర్శకుడు సర్ది చెప్తున్నట్లు తెలుస్తోంది. తన తొలి చిత్రం వివాదాల్లో ఇరుక్కోవటం ఇష్టం లేదని హీరో చెప్పటంతో... అయితే ఇంకా మంచి టైటిల్స్ ఆలోచిద్దామని దర్శక,నిర్మాతలు హామీ ఇచ్చారట. గతంలోనూ ఇదే టైటిల్ తో ...మీర్జాపురం రాజా శ్రీ శోభనాచల పిక్చర్స్ పతాకంపై సి. పుల్లయ్య దర్శకత్వంలో 'గొల్లభామ' చిత్రాన్ని నిర్మించారు. కృష్ణవేణి, ఈలపాట రఘురామయ్య ఈ చిత్రంలోని ముఖ్య పాత్రధారులు.
పూజా హెగ్డే హీరోయిన్ గా చేస్తున్న ఈ చిత్రానికి శ్రీకాంత్ అడ్డాల దర్శకుడు. ఈ సినిమా రెగ్యులర్ చిత్రీకరణ సోమవారం కొచ్చిన్‌లో ప్రారంభమైంది. గ్రామీణ నేపథ్యంలో సాగే ప్రేమకథగా సినిమా ఉండబోతోందని తెలుస్తోంది. ఈ చిత్రంలో హీరో వాలీబాల్ ప్లేయర్ గా కనిపించనున్నాడని సమాచారం. బ్రహ్మానందం,ప్రకాష్ రాజ్, నాజర్, రావు రమేష్ తదితరులు నటిస్తున్నారు. మిక్కీజే మేయర్ సంగీతం అందిస్తున్నారు.
లియో ప్రొడక్షన్స్ పతాకంపై సినిమా రూపొందబోతోంది. శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వం అందిస్తున్న దీనికి ఠాగూర్ మధు, నల్లమలుపు బుజ్జి నిర్మాతలు. గోదావరి అందాల నడుమ సాగే చక్కటి ప్రేమకథగా సినిమా ఉండబోతోందని చిత్రవర్గాలు చెబుతున్నాయి. 'కొత్తబంగారులోకం',' సీతమ్మవాకిట్లో సిరిమల్లె చెట్టు' చిత్రాలతో తనదైన ముద్ర తెలుగు తెరపై వేసి ఆకట్టుకొన్నాడు శ్రీకాంత్ అడ్డాల. ఇప్పుడు వరుణ్‌తేజ్‌తో తొలి అడుగులు వేయించేందుకు సిద్ధమవుతున్నాడు.
చిరంజీవి మాట్లాడుతూ... నాగబాబు కొడుకంటే నా కొడుకు అన్నట్లే అని, వరుణ్ తేజను అభిమానులు ఆశీర్వదించాలని చిరంజీవి కోరారు.నాగబాబు కొడుకు వరుణ్ తేజను ప్రమోట్ చేయడానికి మెగా హీరోలంతా కలిసి పని చేయనున్నారు. చిరంజీవి, పవన్ కళ్యాణ్‌తో పాటు రామ్ చరణ్, అల్లు అర్జున్ తదితరులు సినిమా ప్రచార కార్యక్రమాల్లో పాల్గొనున్నారు. చిరంజీవి, పవన్ కళ్యాణ్‌లకు స్వయాన సోదరుడైన నాగబాబు....తన కొడుకు ఎంట్రీ కోసం పర్ ఫెక్టుగా ప్లానింగ్ చేసారు. గతంలో పవన్ కళ్యాణ్, రామ్ చరణ్ ఎంట్రీ సందర్భంగా ఏర్పాట్లను దగ్గరుండి చూసుకున్న అనుభవం నాగబాబుకు ఉంది.


Click it and Unblock the Notifications











