వరుణ్ తేజ్ - లావణ్య త్రిపాఠి ప్రేమ వెనుక ఆ దర్శకుడి హస్తం.. అలా సెట్టయ్యిందట?
ఇటీవలి కాలంలో టాలీవుడ్ నుంచి హాట్ టాపిక్ అవుతోన్న పేర్లలో మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ ఒకటి. దీనికి కారణం అతడు ఓ హీరోయిన్‌ను పెళ్లి చేసుకోబోతున్నాడంటూ వస్తున్న వార్తలే అన్న విషయం తెలిసిందే. అయితే, ఇప్పుడా పుకార్లు మరింతగా బలోపేతం అయ్యాయి.
అంతేకాదు, అతడు హీరోయిన్ లావణ్య త్రిపాఠిని వివాహం చేసుకోబోతున్నాడంటూ, ఇందులో భాగంగానే వీళ్లిద్దరూ నిశ్చితార్థం కూడా చేసుకుంటున్నారని న్యూస్ వైరల్ అవుతోంది. ఈ నేపథ్యంలో అసలు లావణ్య - వరుణ్ మధ్య ప్రేమ పుట్టడానికి డైరెక్టరే కారణం అని ఓ ప్రచారం మొదలైంది. ఆ వివరాల్లోకి వెళితే..

లావణ్యతో వరుణ్ డేటింగ్: మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్.. టాలీవుడ్ క్యూట్ హీరోయిన్ లావణ్య త్రిపాఠితో డేటింగ్‌లో ఉన్నాడని చాలా రోజులుగా ప్రచారం జరుగుతోంది. కానీ, ఈ వార్తలకు కన్ఫర్మేషన్ మాత్రం రాలేదు. అంతేకాదు, దీనిపై నాగబాబును సైతం కొందరు నెటిజన్లు ప్రశ్నించారు. ఆయన కూడా ఈ ప్రశ్నలకు సమాధానాలను దాటవేశారు. ఫలితంగా వీళ్ల వ్యవహారం మిస్టరీగా మారిపోయింది.

పెళ్లి అంటూ వచ్చిన లీక్స్: ఒకవైపు అటు మెగా ఫ్యామిలీ నుంచి కానీ, ఇటు హీరోయిన్ కుటుంబం నుంచి కానీ ఎలాంటి సమాచారం రాకపోయినా.. వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠి మధ్య బంధం నిజమేనని టాక్ నడిచింది. ఇలాంటి పరిస్థితుల్లో వీళ్లిద్దరూ పెళ్లికి రెడీ అయ్యారని.. ఇందుకు ఇరు కుటుంబాల సభ్యులు ఒప్పుకున్నారని ఇటీవలే కొన్ని వార్తలు గుప్పుమన్న విషయం తెలిసిందే.

ఆరోజే ఇద్దరికీ నిశ్చితార్థం: మెగా హీరో వరుణ్ తేజ్.. హీరోయిన్ లావణ్య త్రిపాఠితో ఏడడుగులు నడవబోతున్నాడని టాక్ నడుస్తోన్న సమయంలోనే.. వీళ్లిద్దరి ఎంగేజ్‌మెంట్ డేట్ ఫిక్స్ అయినట్లు మరో ప్రచారం మొదలైంది. దీని ప్రకారం వరుణ్ - లావణ్యల నిశ్చితార్థం జూన్ 9వ తేదీన జరగబోతుందట. దీనికి రెండు కుటుంబాల సభ్యులతో పాటు కొందరు సన్నిహితులు మాత్రమే హాజరవుతారని తెలుస్తోంది.

ఆ డైరెక్టరే కారణం అంటూ: లావణ్య త్రిపాఠితో వరుణ్ తేజ్ ప్రేమలో ఉన్నాడని చాలా ఏళ్ల నుంచే ప్రచారం మొదలైంది. అయితే, వీళ్ల మధ్య లవ్ పుట్టడానికి కారణం ఒక టాలీవుడ్ డైరెక్టర్ అని తాజాగా సోషల్ మీడియాలో న్యూస్ వైరల్ అవుతోంది. ఆయన మరెవరో కాదు.. వరుణ్, లావణ్యను పెట్టి 'మిస్టర్' అనే సినిమా తీసిన శ్రీను వైట్ల అట. ఆయనకు దీనితో సంబంధం లేకున్నా కొందరు ఫన్నీ పోస్ట్ చేస్తున్నారు.

మీమ్స్ అయినా నిజమేనా: 'మిస్టర్' సినిమా చేస్తోన్న సమయంలోనే వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠి మధ్య ప్రేమ మొదలైనట్లు ఇప్పటికే వార్తలు వచ్చాయి. దీన్ని ఉద్దేశిస్తూనే చాలా మంది నెటిజన్లు శ్రీను వైట్లను మధ్యలోకి తీసుకొచ్చి ఫన్నీగా మీమ్స్, పోస్టులు చేస్తున్నారు. దీంతో ఈ డైరెక్టర్ పేరు, 'మిస్టర్' సినిమా ఇప్పుడు ట్రెండ్ అవుతోన్నాయి. ఇలా మెగా ప్రిన్స్ పెళ్లిలో శ్రీను వైట్ల హైలైట్ అవుతోన్నారు.


Click it and Unblock the Notifications











