twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    వీరూపోట్లతో మెగా హీరో చిత్రం ఖరారు?

    By Srikanya
    |

    హైదరాబాద్ : దర్శకుడు వీరూపోట్ల తన తదుపరి చిత్రాన్ని మెగా హీరో నాగబాబు కుమారుడు వరుణ్ తేజ తో కమిటైనట్లు ఫిల్మ్ నగర్ వర్గాల సమాచారం. ఈ మేరకు రీసెంట్ గా నాగబాబుని కలిసి చర్చలు జరిపారని అంటున్నారు. అలాగే ఈ చిత్రాన్ని నల్లమలుపు బుజ్జి నిర్మించనున్నట్లు తెలుస్తోంది. ఇక ఈ చిత్రానికి కథని వెలిగొండ శ్రీనివాస్ అందిస్తున్నట్లు చెప్తున్నారు. వీరూపోట్ల ..స్వతహాగా ..దర్శక,రచయిత..అలాంటిది వేరే రైటర్ కథ ఓకే చేసి ముందుకు వెళ్తున్నారంటే కథలో చాలా విషయం అయినా ఉండాలి లేదా ఆబ్లిగేషన్ అయినా ఉండాలి. కమర్షియల్ ఫన్ ఎంటర్టైనర్ గా చిత్రం ఉండనుందని తెలుస్తోంది.

    ఇక వరుణ్ తేజ తాజా చిత్రం కంచె విషయానికి వస్తే...

    రెండో ప్రపంచ యుద్ధం నేపథ్యంగా తెరకెక్కిన ఈ చిత్రంలో వరుణ్‌తేజ్‌ ఓ సైనికుడి పాత్రలో కన్పించనున్నారు. అప్పటి పరిస్థితులను, యుద్ధ సన్నివేశాలను తెరకెక్కించిందేందుకు చాలా శ్రమించాల్సి వచ్చిందని ఓ సందర్భంలో క్రిష్‌ చెప్పారు. ఫస్ట్‌ ఫ్రేమ్‌ ఎంటర్‌టైన్‌మెంట్స్‌ పతాకంపై సాయిబాబా, రాజీవ్‌రెడ్డి నిర్మిస్తున్న ఈ సినిమాకు చింతాన్‌భట్‌ సంగీతం అందిస్తున్నారు. ప్రగ్యాజైశ్వాల్‌ హీరోయిన్.

    Varun Teja next with Director Veeru Potla?

    ఈ చిత్రం షూటింగ్ పూర్తయ్యి..విడుదలకు సిద్దంగా ఉంది. ఈ నేపధ్యంలో చిత్రం ప్రమోషన్స్ ని వేగవంతం చేసారు. ఇందులో భాగంగా చిత్రం మేకింగ్ వీడియోని విడుదల చేసారు. ఇక్కడ ఆ వీడియోని చూడండి.

    మరో ప్రక్క ఈ చిత్రం బిజినెస్ ఊపందుకుంది. ఓవర్ సీస్ లో సైతం ఈ చిత్రం మంచి రేటుకు అమ్ముడుపోయింది. ఓవర్ సీస్ లో కొత్తగా డిస్ట్రిబ్యూషన్ బిజినెస్ లోకి ప్రవేశించిన "Absolute Telugu Cinemas" వారు ఈ చిత్రం రైట్స్ ని కోటి పాతిక లక్షలకు సొంతం చేసుకున్నట్లు సమాచారం. ఈ కంపెనీని కొంతమంది ఎగ్జిబిటర్స్ కలిసి ఏర్పాటు చేసుకున్నారు.

    ఫేస్‌బుక్ ద్వారా లేటెస్ట్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు

    రామ్ చరణ్ మాట్లాడుతూ... ప్రస్తుతం ఇండస్ట్రీలో ఉన్న ఏ డైరెక్టర్‌ను సినిమాలు చేయాలని అడగలేదు. కానీ నేను ఐదేళ్లుగా సినిమా చేద్దామని క్రిష్‌ని అడుగుతున్నాను. నేను, ప్రకాష్, రానా, క్రిష్ ఒక బ్యాచ్. ఒక రోజు క్రిష్ కథ ఉందని చెబితే ఇంటికి రమ్మన్నా. వచ్చి కథ చెప్పాడు. సెకండాఫ్ చెప్పడానికి రాలేదు. ఆ సబ్జెక్టు‌కి నేను సెట్ కానని అనుకున్నాడా? లేక ఆ కథనే వరుణ్ తేజ్ తో తీసాడా? ఒక వేళ అదే కథని వరుణ్‌తో తీసి ఉంటే క్రిష్ అయిపోతాడు. ఈ కథ కోసం ఎన్నో నెలలు జార్జియాలో షూటింగ్ చేసారు. కెమెరామెన్ బాగా చేసారు. వరుణ్ హైట్ చూస్తుంటే నాకు అన్నయ్యలాగా ఉన్నాడు. మా ఫ్యామిలీలో మంచి అందగాడే కాదు, మంచి గట్స్ ఉన్న హీరోగా పేరు తెచ్చుకుంటాడు. నాక్కూడా అలాంటి గట్స్ రావాలి. క్రిష్‌కి కూడా అలాంటి గట్స్ నచ్చి నాతో సినిమా చేయాలి' అని వ్యాఖ్యానించారు.

    దర్శకుడు క్రిష్ మాట్లాడుతూ... ఈ సినిమా కోసం జార్జియా గవర్నమెంట్ అనుమతి తీసుకుని ఆ బ్యాక్ డ్రాపుకు తగిన విధంగా గన్స్, ట్యాంకర్స్, టీకప్స్ ఇలా అన్నీ ఉపయోగించాం. ఆర్ట్ డైరెక్టర్ సాహి సురేష్, సినిమాటోగ్రాఫర్ జ్ఞానశేఖర్ వండర్ ఫుల్ ఎఫర్టె పెట్టి పని చేసారు. రెండో ప్రపంచ యుద్ధం మీద తీసిన ఈ సినిమాకు చింతన్ భట్ మంచి సంగీతాన్ని ఇచ్చారు. మనకు చాలా మంది దర్శకులు ఉన్నా ఎందుకో రెండో ప్రపంచ యుద్ధం గురించి కథను తీయలేదు. నేను ఎవరికీ భిన్నంగా ఉండాలని ఈ కథను చెప్పలేదు. చెప్పని కథలను చెప్పడానికి ఈ అవకాశం ఇచ్చిన నిర్మాతలకు థాంక్స్' అన్నారు.

    వరుణ్ తేజ్ మాట్లాడుతూ.... ఈ సినిమాలో నటించే అవకాశం రావడం గౌరవంగా భావిస్తున్నాను. నా టీమ్ అందరికీ దన్యవాదాలు. పండగరోజు అందరూ ఫ్యామిలీతో ఉండాలనుకుంటారు. అభిమానులందరూ నా ప్యామిలీ. పెదనాన్న చిరంజీవి గారికి నేను పెద్ద ఫ్యాన్. ఆయన సినిమాలు చూస్తూ పెరిగాను. ఆయనకు థాంక్స్ తప్ప ఏమీ చెప్పుకోలేను. మంచి సినిమా చేస్తున్నాను. నాన్న పరువు నిలబడెతాను. సినిమా విడుదలైన తర్వాత బాబాయ్ పవన్ కళ్యాణ్ కి చూపిస్తాను. సినిమా ఎలా ఉందని అడుగుతాను. అభిమానులు గర్వ పడేలా సినిమా ఉంటుంది. అన్నారు.

    Varun Teja next with Director Veeru Potla?

    సిరివెన్నెల మాట్లాడుతూ... రెండో ప్రపంచ యుద్ధం నేపథ్యంలో తెలుగులో సినిమా రావడం ఇదే తొలిసారి. ఈ సినిమా మనల్ని 1945లోకి తీసుకెళ్తాయి. యుద్దంలో ప్రేమ ఉంటుంది. ప్రేమ కూడా యుద్ధంలాగే ఉంటుంది అని చెబుతూ ప్రపంచంలోని మనిషి దేని కొట్టుకుంటున్నాడో తెలియని దాన్ని యుద్ధం రూపంలో చెప్పడం, అందులోనే ప్రేమను కూడా చెప్పడం, ఈ మనిషి తాలూకు వైరుధ్యాన్ని చూపడం నాకు చాలా బాగా నచ్చింది అన్నారు. వరుణ్ ని చూస్తుంటే హాలీవుడ్ నటున్నిచూసినట్లు ఉంది. రెండో సినిమాకే ఇలాంటి సినిమాలో అవకాశం దొరకడం అదృష్టం అన్నారు.

    ఇప్పటికే రిలీజ్ అయిన ఫస్ట్ లుక్ మరియు టీజర్ అందరిలోనూ ఆసక్తిని పెంచాయి. ఈ సినిమా వరల్డ్ వార్ 2 బ్యాక్ డ్రాప్ లో రానుంది . అలాగే...స్వాతంత్రానికి ముందు జరిగే కథతో రూపొందే ఈ చిత్రం విడుదల తేదీని ...కూడా దేశభక్తికి చెందిన తేదీనే ఎంచుకోవాలని నిర్ణయించుకున్నారు. ఆ తేదీ మరేదో కాదు....అక్టోబర్ 2, అంటే గాంధీ జయింతి రోజున ఈ చిత్రం విడుదల చేయాలని ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం. బ్రిటీష్ వారికి, జమీందార్ వ్యవస్దకు వ్యతిరేకంగా సాగే పోరాటంతో ఈ చిత్రం కథ సాగనుంది.

    ఇక ఈ చిత్రంలో వరుణ్ తేజ..సైనికుడుగా కనిపిస్తాడని తెలుస్తోంది. 1910 వ సంవత్సరంలో కథ జరుగుతుంది. వరుణ్ తేజలోని నటుణ్ణి క్రిష్ 'కంచె' చిత్రంలో వెలికి తెచ్చాడని యూనిట్ సభ్యులు అంటున్నారు... ఈ సినిమాతో వరుణ్ హీరోగా నిలదొక్కుకోవడం ఖాయమనీ చెబుతున్నారు.

    English summary
    Director of some hits like Bindaas, Ragada, Doosukelta Veeru Potla hasn't started his next film yet. Now, as per the latest buzz in the industry, Veeru Potla will direct Mega Hero V arun Teja. Script work is almost finalised and an official announcement will be made soon on this regard.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X