Ghani: మెగా అభిమానులకు మరో షాకింగ్ న్యూస్.. రిలీజ్‌ విషయంలో వరుణ్ యూటర్న్

మెగా ఫ్యామిలీ నుంచి సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చినా.. అద్భుతమైన టాలెంట్‌తో తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపును అందుకున్నాడు మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్. కెరీర్ ఆరంభంలోనే మంచి మంచి చిత్రాలను ప్రేక్షకులకు అందించిన అతడు.. పలు విజయాలను కూడా తన ఖాతాలో వేసుకున్నాడు. ఈ ఉత్సాహంతోనే వరుస పెట్టి సినిమాల మీద సినిమాలు చేస్తూ వెళ్తున్నాడు. ఇక, ఇటీవలి కాలంలో ఎన్నో హిట్లను అందుకున్నాడు. దీంతో మరింత జోష్‌తో కనిపిస్తున్నాడు. అలా ఎన్నో ప్రాజెక్టులను సైతం పట్టాలెక్కించేందుకు ప్లాన్ చేసుకుంటున్నాడు. ఈ క్రమంలోనే తాజాగా అతడు 'గని' అనే సినిమాలో నటిస్తున్నాడు.

బాక్సింగ్ నేపథ్యంతో రాబోతున్న 'గని' మూవీ షూటింగ్ ఎప్పుడో ప్రారంభం అయింది. కానీ, అనివార్య కారణాల వల్ల తరచూ ఆటంకాలు ఎదురవడంతో చిత్రీకరణ మాత్రం పూర్తి కాలేదు. ఇలాంటి పరిస్థితుల్లో ఇటీవలే క్లైమాక్స్‌కు సంబంధించిన ఫైనల్ షెడ్యూల్‌ను హైదరాబాద్‌లో ప్రారంభించారు. ఇందులో చివరి ఫైట్ సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు. ఇది దాదాపుగా పూర్తి అయిపోయింది. ఇది జరుగుతోన్న సమయంలోనే ఈ సినిమాకు సంబంధించిన డబ్బింగ్ పనులను కూడా చిత్ర యూనిట్ మొదలు పెట్టేసింది. ఈ క్రమంలోనే పలువురు ఇప్పటికే తమ పాత్రలకు డబ్బింగ్ చెప్పుకున్నారు.

మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ హీరోగా కిరణ్ కొర్రపాటి తెరకెక్కించిన 'గని' చిత్రాన్ని వీలైనంత త్వరగా పూర్తి చేసుకుని ఈ ఏడాది దీపావళి పండుగ కానుకగా నవంబర్ 4వ తేదీన ప్రేక్షకుల ముందుకు తీసుకు రావాలని చిత్ర యూనిట్ భావిస్తోంది. ఇందులో భాగంగానే ప్రస్తుతం షూటింగ్ కొంత భాగం బ్యాలెన్స్ ఉండగానే ఈ సినిమాకు సంబంధించిన డబ్బింగ్ పనులను మొదలు పెట్టేశారు. ఈ విషయాన్ని చిత్ర యూనిట్ అధికారికంగా ప్రకటించింది. ఈ మేరకు ఓ ఫొటోను కూడా విడుదల చేశారు. దీంతో దీపావళి పండుగ రోజు డబుల్ ట్రీట్ ఉంటుందని మెగా అభిమానులు తెగ సంబర పడిపోయారు.

Varun Tejs Ghani Movie Release Postponed to December

'గని' సినిమా విడుదలకు సంబంధించి తాజాగా ఓ షాకింగ్ న్యూస్ ఫిలిం నగర్ ఏరియాలో విపరీతంగా వైరల్ అవుతోంది. దీని ప్రకారం.. ఈ చిత్రాన్ని నవంబర్ 4న ప్రేక్షకుల ముందుకు తీసుకు రావడం లేదట. పోస్ట్ ప్రొడక్షన్ పనులతో పాటు కొంత షూట్ అప్పటికి పూర్తైపోయినా.. ప్రమోషన్ కార్యక్రమాలకు వీలైనంత సమయం దొరకని కారణంగానే చిత్ర యూనిట్ ఈ నిర్ణయం తీసుకుందని తెలుస్తోంది. ఇక, ఈ మూవీని డిసెంబర్‌లో విడుదల చేయబోతున్నట్లు తెలుస్తోంది. దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన అతి త్వరలోనే రాబోతుందని ఇండస్ట్రీ ఏరియాలో గుసగుసలు వినిపిస్తున్నాయి.

క్రేజీ కాన్సెప్టుతో ఎంతో ప్రతిష్టాత్మకంగా రాబోతున్న 'గని' సినిమాలో వరుణ్ తేజ్ ప్రొఫెషనల్ బాక్సర్‌గా నటిస్తున్నాడు. ఇందుకోసం చాలా కాలం పాటు అమెరికాలో బాక్సింగ్‌లో శిక్షణ కూడా తీసుకున్నాడు. ఇక, ఈ సినిమాను గీతా ఆర్ట్స్ బ్యానర్‌పై అల్లు అరవింద్ సమర్పణలో సిద్ధు ముద్ద, అల్లు బాబీ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. నవీన్ చంద్ర కూడా హీరోకు పోటీనిచ్చే బాక్సర్‌గా చేస్తున్నాడు. ఈ చిత్రంలో బాలీవుడ్ బ్యూటీ సయీ మంజ్రేకర్ హీరోయిన్‌గా నటిస్తోంది. వీళ్లతో పాటు సునీల్ శెట్టి, కన్నడ హీరో ఉపేంద్ర కూడా కీలక పాత్రలను పోషిస్తున్నారు. థమన్ ఈ సినిమాకు సంగీతం సమకూర్చుతున్నాడు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X