రామ్ చరణ్,క్రిష్ కాంబినేషన్ చిత్రం ఆ కథతోనేనా?
రామ్ చరణ్, క్రిష్ కాంబినేషన్ లో త్వరలో ఓ చిత్రం ప్రారంభంకానుందనే సంగతి తెలిసిందే.అయితే ఆ చిత్రం మరేదో కాదు...ఇంతకుముందు వెంకటేష్ కోసం సంవత్సరం పాటు కూర్చుని తయారుచేసిన కృష్ణం వందే జగద్గురం చిత్రమేనంటున్నారు. అప్పట్లో సురేష్ బాబు, అశ్వనీదత్ కలిసి ఆ చిత్రం నిర్మిద్దామని ప్లాన్ చేసారు. రంగ్ దే బసంతి తరహాలో జరిగే కథగా ఈ చిత్రం రూపొందనుందని వార్తలు వచ్చాయి. అయితే కథ తృప్తి చెందకపోవటంతో ఆ ప్రాజెక్టు మెటీరియలైజ్ కాలేదు.దాంతో వేదం సినిమాముందుకొచ్చింది.వేదం రిలీజయ్యాక అదే సినిమా తమిళ వెర్షన్ ఆఫర్ క్రిష్ కి రావటంతో అటు వెళ్ళిపోయాడు. ఇప్పుడు ఆ సినిమా పూర్తి చేసి, తనదగ్గరున్న కథని రామ్ చరణ్ కి నేరేట్ చేయటంతో వెంటనే ఓకే చేసాడని తెలుస్తోంది. మెరుపు చిత్రం అనంతరం ఈ సినిమా ప్రారభం కానుంది.
రామ్ చరణ్ తేజ్ అల్లు అర్జున్ వేదం గమ్యం మెరుపు ఆరెంజ్ క్రిష్ ram charan teja orange merupu krishna vamsi gamyam allu arjun krish


Click it and Unblock the Notifications