కళ్యాణ్ రామ్ ఆఫర్ ని రిజెక్ట్ చేసిన యంగ్ డైరక్టర్
'అతనొక్కడే' తర్వాత చెప్పుకోతగ్గ హిట్స్ లేని కళ్యాణ్ రామ్ తన తదుపరి చిత్రానికి యంగ్ డైరక్టర్ క్రిష్ ని ఎంచుకున్నారు. అయితే 'వేదం' చిత్రం రిలీజ్ కు ముందు ఈ ఆఫర్ ఇచ్చారు. అయితే 'వేదం' రిలీజ్ అయిన తర్వాత మాట్లాడుకుందామని క్రిష్ చెప్పటం జరిగింది. 'వేదం' రిజల్ట్ వేరే విధంగా ఉంటే ఏమయ్యోదో కానీ ప్రస్తుతం వేదం కలెక్షన్స్ బాగుండటంతో క్రిష్ ఉషారుగా ఉన్నారు. దాంతో కళ్యాణ్ రామ్ కి రిప్లై ఇవ్వలేదని తెలుస్తోంది. దాంతో కళ్యాణ్ రామ్ కంగ్రాట్స్ చెప్పి లైన్ లోకి వచ్చి తను పెట్టిన ప్రపోజల్ విషయం ప్రస్ధావించారు. దానికి క్రిష్ ...తను ఇదే నిర్మాతలకు మరో ప్రాజెక్టు చేయాలని కమిట్ అయ్యానని, అది అయిన తర్వాతే వేరే దాని గురించి ఆలోచించగలనని నిష్కర్షగా చెప్పేసారుట. ఇక ప్రస్తుతం కళ్యాణ్ రామ్...తనతో గతంలో అభిమన్యు అనే చిత్రం చేసిన మల్లి దర్శకత్వంలో 'హరే రామ హరే కృష్ణ' అనే చిత్రం చేస్తున్నారు.


Click it and Unblock the Notifications











