twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    ఎఫ్‌హెచ్‌ఎం మ్యాగజైన్‌పై నగ్నంగా వీణా మాలిక్

    By Bojja Kumar
    |

    పాకిస్థానీ మోడల్ వీణా మాలిక్ ఫోటో ఎఫ్‌హెచ్‌ఎం మ్యాగజైన్ పై నగ్నంగా దర్శనం ఇచ్చింది. డిసెంబర్ నెలకు గాను విడుదలైన ఆ మ్యాగజైన్ కవర్ పేజీపై వీణా ఒంటిపై నూలు పోగు కూడా లేకుండా, తన శరీరంలోని సీక్రెట్ భాగాలు బహిర్గతం కాకుండా తన చేతులు, కాళ్లతో కవర్ చేస్తూ చాలా అందంగా, సెక్సీగా, కుర్రకారు మతులు పోగొట్టేలా ఉంది ఆమె ఫిగర్. దీనికి తోడు తన ఎడమ చేతిపై పాకిస్థాన్ గూడచార సంస్థ ఐఎస్ఐ పేరును టాటూగా వేసుకుని ఈ ఫోటో ఉండటంతో సర్వత్రా చర్చనీయాంశం అయింది. ఈ ఫోటోపై పాకిస్తానీ మత చాందస వాదులు అగ్గిమీద గుగ్గిలం అవుతున్నారు. మత సంప్రదాయాలను మంటగలుపతోందని, దేశం పరువు బజారుకీడ్చిందని ఫైర్ అవుతున్నారు.

    ఈ మధ్య చాలా మంది తారలు ఎఫ్‌హెచ్‌ఎం మ్యాగజైన్ బట్టలిప్పి బరితెగించడం, తీరా ఫోటోపై విమర్శలు వచ్చిన తర్వాత తాము కాదు, మార్ఫింగ్ అంటూ బుకాయించడం కామన్ అయిపోయింది. ఆ మధ్య కాజల్ టాప్ లెస్ ఫోటోపై చెలరేగిన వివాదం అంతా ఇంత కాదు. మరి ఈ ఫోటో నిజంగా వీణా మాలిక్ ఇష్టానుసారంగా తీయించుకుందా? లేక మార్ఫింగా? అనే తేలాల్సి ఉంది.

    తన అంగాంగాలు ప్రదర్శించడంలో ఏమాత్రం సిగ్గు పడని వీణా ఇప్పటికే చాలా సార్లే టాప్ లెస్ ఫోటోషూట్లలో పాల్గొంది. అంతే కాదు నా బాడీ చాలా సెక్సీగా ఉంటుంది, నా అందాన్ని చూసి ఎవ్వరైనా ప్లాట్ కావాల్సిందే అంటూ స్టేట్ మెంట్లు ఇచ్చి గతంలో సంచలన వ్యాఖ్యలు చేసింది కూడా. ఈ నేపథ్యంలో ఈ ఫోటోలో ఉన్నది వీణా మాలికే అని చాలా మంది బలంగా నమ్ముతన్నారు. ఇప్పటికే ఈ ఫోటో ఫేస్ బుక్, ట్విట్టర్లలో పాకి పోయింది. ఇందులో ఆమె అందాలు చూసి ముగ్దులైపోతున్నారు ఆమె అభిమానులు.

    బిగ్ బాస్ షో ద్వారా ఇండియాలో ఎంట్రీ ఇచ్చిన వీణా ఆ షోలో చేసిన హడావుడి ఇంతా అంతా కాదు. ఈ మధ్య తరచూ తన అందాలను ఆరబోసి ఇంటర్నెట్ లోకి వదులుతోంది. సెక్స్ బాంబ్ ఇమేజ్ సొంతం చేసుకుని బాలీవుడ్ లో పాగా వేయాలనేదే ఆమె లక్ష్యంగా కనిపిస్తోంది. మరి వీణా ఈసారి నగ్నంగా చేసిన ప్రయత్నం ఆమె కెరీర్ కు ఎంత మేరకు ఉపకరిస్తుందో...

    English summary
    Veena Malik appeared nude on the cover of FHM magazine with an ‘ISI’ tattoo on her arm, but has been forced to deny it after it sparked outrage among conservatives in Pakistan - both for her nudity and the reference to the country’s intelligence agency. The controversial photo appears on the December issue of the magazine.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X