న్యూడ్ లేడీ రెమ్యూనరేషన్ తెలుగులో అంతా?
తాజాగా ఫిల్మ్ నగర్ నుంచి వినిపిస్తున్న గాసిప్స్ ప్రకారం...వీణా మాలిక్ ప్రస్తుతం తెలుగులో చేస్తున్న 'నగ్న సత్యం' సినిమాకు రూ. 1.5 కోట్లు తీసుకుంటోందట. ప్రస్తుతం తెలుగులో టాప్ హీరోయిన్స్ గా ఉన్న వారికి కూడా ఈ రేంజిలో రేటు లేదు. మరి వార్తల్లో నిజా నిజాలు తేలాల్సి ఉంది.
ఒక వేళ అదే నిజమైతే...'నగ్న సత్యం' ఈచిత్రంలో వీణామాలిక్ తో ఏమైనా నగ్న సన్నివేశాలు చేయించే ఉద్దేశ్యంతో ఇంత భారీ మొత్తం ఇచ్చేందుకు నిర్మాతలు రెడీ అయ్యారని టాక్. ఇలాంటి సీన్లలో నటించడానికి వీణా మాలిక్ అందరి కంటే ముందు ఉంటుందనే విషయం తెలిసిందే.
నగ్న సత్యం సినిమా విషయానికొస్తే... అనురాధా ఫిలిమ్స్ పతాకంపై చదలవాడ శ్రీనివాసరావు ఈ చిత్రాన్ని నిర్మిస్తారు. రామారావు దర్శకుడిగా పరిచయమవుతున్నారు. సమర్పణ: చదలవాడ తిరుపతిరావు. చదలవాడ శ్రీనివాసరావు గతంలో అన్నావదిన, రిక్షారుద్రయ్య, వార్నింగ్, ప్రేమించాను నిన్నే చిత్రాలను నిర్మించారు.


Click it and Unblock the Notifications












