జూ ఎన్టీఆర్‌తో పాకిస్తాన్ బ్యూటీ రొమాన్స్గ్?
హైదరాబాద్ : యంగ్ టైగర్ జూ ఎన్టీఆర్ తర్వాతి సినిమాల్లో పాకిస్తాన్ బ్యూటీ ఐటం సాంగు చేయబోతోందా? అంటే అవుననే అంటున్నాయి ఫిల్మ్ నగర్ వర్గాలు. ఆయన తర్వాతి సినిమా 'రభస'లో పాకిస్తాన్ బ్యూటీ వీణా మాలిక్ ఐటం సాంగు చేయబోతుందని అంటున్నారు. బిగ్ బాస్ షో ద్వారా ఇండియన్ ఎంటర్టెన్మెంట్ రంగంలోకి అడుగు పెట్టి న్యూడ్ ఫోటోలు, వివాదాస్పద వ్యాఖ్యలతో పాపులర్ అయింది వీణా మాలిక్.
కందిరీగ ఫేం సంతోష్ శ్రీనివాస్ దర్శకత్వం వహిస్తున్న ఈచిత్రాన్ని బెల్లంకొండ సురేష్ సమర్పణలో శ్రీలక్ష్మీ నరసింహ ప్రొడక్షన్స్ పతాకంపై ప్రొడక్షన్ నెం.3గా బెల్లంకొండ గణేష్ బాబు నిర్మిస్తున్నారు. ఈ చిత్రం టైటిల్ ఖరారు కానప్పటికీ...'రభస' అనే పేరు ప్రచారంలో ఉంది.
ఇటీవల మొదలైన తొలి షెడ్యూల్‌లో యాక్షన్స్ సీన్స్ చిత్రీకరణ జరిపారు. ప్రస్తుతం షూటింగ్ హైదరాబాద్ పరిసరస ప్రాంతాల్లో సాగుతోంది. తాజాగా ఫిల్మ్ నగర్ నుంచి అందుతున్న సమాచారం ప్రకారం ఈ చిత్రం సెకండ్ షెడ్యూల్ సెప్టెంబర్ 10 నుంచి ప్రారంభం కానున్నట్లు తెలుస్తోంది.
ఎన్టీఆర్ సరసన సమంత హీరోయిన్ గా నటిస్తున్న ఈచిత్రంలో షాయాజీ షిండే, జయసుధ, బ్రహ్మానందం, రఘుబాబు, జయప్రకాష్ రెడ్డి, నాజర్, అజయ్ తదితరులు ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. ఎన్టీఆర్ కెరీర్లో ఒక మంచి వినోదాత్మక చిత్రంగా తీర్చదిద్దేందుకు ప్రయత్నిస్తున్నారు.
ఈ చిత్రానికి సంగీతం : అనూప్ రూబెన్స్, ఫోటోగ్రఫీ : శ్యామ్ కె నాయుడు, ఫైట్స్ : రామ్ లక్ష్మణ్, ఎడిటింగ్ : కోటగిరి వెంకటేశ్వరరావు, ఆర్ట్ : ఎ.ఎస్.ప్రకాష్, సమర్పణ : బెల్లంకొండ సురేష్, నిర్మాత : బెల్లంకొండ గణేష్ బాబు, కథ-స్క్రీన్ ప్లే-మాటలు-దర్శకత్వం : సంతోష్ శ్రీనివాస్.


Click it and Unblock the Notifications











