రవితేజ 'వీర'ఫ్లాప్ ఎఫెక్టుతో సునీల్ సినిమా ఆగిపోనుందా?
రవితేజ హీరోగా రమేష్ వర్మ దర్శకత్వంలో రూపొందిన వీర చిత్రం శుక్రవారం విడదలై డిజాస్టర్ టాక్ తెచ్చుకున్న సంగతి తెలిసిందే.అయితే ఈ చిత్రం ప్లాప్ తో రవితేజకు పెద్దగా నష్టపోయేదేమీ ఉండదు.ఎందుకంటే వరస హిట్స్ తో దూసుకుపోతున్న రవితేజకు ఇది చిన్న బ్రేక్ అవుతుందేమో కానీ..పెద్దగా ఇబ్బంది ఎదురుకాదు.కానీ ఇదే బ్యానర్ లో చేయటానికి కమిటైన సునీల్ కి మాత్రం ఈ ఎఫెక్టు గట్టిగా పడనుంది అంటున్నారు.అసలే సునీల్ కి వర్మతో చేసిన అప్పలరాజు చిత్రం ప్లాప్ అయ్యి ఉన్న అవకాశాలును నాశనం చేసింది.
ఆ పరిస్దితిలో అంతకు ముందు ఎనౌన్స్ చేసిన నెపోలియన్ అంతా కాన్సిల్ అయిందని అన్నారు.దాంతో కంగారుగా నిర్మాతను కలిసి త్వరలో ప్రారంభం కానుందని ప్రకటన ఇప్పించాడు సునీల్.అయితే వీర దెబ్బతో ఆ నిర్మాత వీర నష్టాల్లో కూరుకుపోయి వాటినన్నటినీ క్లియర్ చేసుకుని మాత్రమే నెక్స్ట్ చిత్రం ప్రారంభించే అవకాశం ఉందని అంటున్నారు.బయిట ఏ సినిమాలూ లేక ఉన్న ఈ ఒక్క సినిమా కూడా దెబ్బ కొట్టితే సునీల్ కు ల్యాగ్ గ్యాప్ వస్తుంది కదా.ఎప్పుడో మర్యాద రామన్న,అందాల రాముడు అనే హిట్స్ వచ్చాయి అని చెప్పుకోవాల్సిందేనేమో.


Click it and Unblock the Notifications











