NBK109: బాలకృష్ణ సినిమాకు ‘వీరమాస్’ టైటిల్.. పేరుతోనే హిట్ కొట్టేశారుగా!
తెలుగు చిత్ర పరిశ్రమలో ఉన్న యంగ్ హీరోలు చాలా నెమ్మదిగా సినిమాలు చేస్తుంటే.. సీనియర్ హీరోలు మాత్రం జెట్ స్పీడుతో దూసుకుపోతోన్నారు. అందులో నటసింహా నందమూరి బాలకృష్ణ మరింత వేగంగా ప్రాజెక్టులు పట్టాలెక్కిస్తున్నారు. ఈ మధ్య కాలంలో వరుసగా హిట్లు కొడుతూ దూసుకుపోతోన్న ఆయన.. ఈ ఉత్సాహంతోనే ఇప్పుడు క్రేజీ ప్రాజెక్టును చేస్తున్నారు.
నటసింహా నందమూరి బాలకృష్ణ హీరోగా నటిస్తోన్న ఈ సినిమాను బాబీ అలియాస్ కేఎస్ రవీంద్ర తెరకెక్కిస్తోన్న విషయం తెలిసిందే. ఈ చిత్రం 1980 దశకంతో పాటు నేటి జనరేషన్ స్టోరీతో రూపొందుతోంది. ఇది డిఫరెంట్ యాక్షన్ అండ్ ఎమోషనల్ డ్రామాగా తెరకెక్కుతోందని అంటున్నారు. దీంతో ఈ చిత్రంపై అంచనాలు భారీగా ఏర్పడగా.. అందుకు తగ్గట్లుగానే తీస్తున్నారు.

బాలయ్య కెరీర్‌లో గతంలో టచ్ చేయని పాయింట్‌తో రూపొందుతోన్న ఈ సినిమాకు సంబంధించిన రెగ్యూలర్ షూటింగ్‌ను కొద్ది రోజుల క్రితమే మొదలు పెట్టారు. ఇందులో యాక్షన్ సీక్వెన్స్ షూట్ చేశారు. ఆ తర్వాత మూవీ యూనిట్ రాజస్థాన్‌తో పాటు చాలా ప్రాంతాలకు వెళ్లి మరీ చిత్రీకరణ జరిపింది. ఇప్పుడు కూడా ఈ సినిమా హైదరాబాద్‌లో చిత్రీకరణ జరుపుతున్నారు.
హై రేంజ్ కాంబినేషన్‌లో రూపొందుతోన్న ఈ సినిమాకు సంబంధించిన షూటింగ్ చాలా వరకూ పూర్తి అయినా దీని సంబంధించిన అప్‌డేట్లు మాత్రం పెద్దగా రాలేదు. ముఖ్యంగా ఈ చిత్రం టైటిల్‌ను చిత్ర యూనిట్ ఇంకా రివీల్ చేయలేదు. దీంతో అసలు ఈ చిత్రానికి ఎలాంటి పేరు పెడతారు అన్నది ఆసక్తికరంగా మారింది. ఈ నేపథ్యంలో తాజాగా ఓ టైటిల్ లీక్ అయింది.

బాలకృష్ణ - బాబీ కాంబినేషన్‌లో రూపొందుతోన్న ఈ చిత్రానికి 'వీరమాస్' అనే టైటిల్‌ను ఫిక్స్ చేసినట్లు తాజాగా న్యూస్ బయటకు వచ్చింది. ఇప్పటికే దీన్ని నిర్మాతలు ఫిలిం చాంబర్‌లో సైతం రిజిస్టర్ చేయించారని తెలిసింది. త్వరలోనే ఈ సినిమా టైటిల్‌తో పాటు రిలీజ్ డేట్‌ను అనౌన్స్ చేస్తారని అంటున్నారు. దీంతో ఇప్పుడీ టైటిల్ సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతోంది.
ఇదిలా ఉండగా.. బాలయ్య హీరోగా బాబీ తెరకెక్కిస్తోన్న ఈ సినిమాను సితారా ఎంటర్‌టైన్‌మెంట్స్, ఫార్చన్ ఫోర్ సినిమాస్, శ్రీకర స్టూడియోస్ బ్యానర్లపై సాయి సౌజన్య, నాగ వంశీ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఇందులో బాబీ డియోల్, ఊర్వశీ రౌటేలా నటిస్తున్నారు. ఈ మూవీకి థమన్ సంగీతాన్ని అందిస్తున్నాడు. ఈ చిత్రం ఈ ఏడాదిలోనే విడుదల కాబోతుంది.


Click it and Unblock the Notifications











