మరో సారి సెంటిమెంట్ నమ్ముతున్న బాలయ్య.. గోపీచంద్ సినిమా కోసం 'సింహా -రెడ్డి' కాంబోలో మాస్ టైటిల్?

హిట్లు ఫ్లాప్ లతో సంబంధం లేకుండా వరుస పెట్టి సినిమాలు చేస్తూ వెళ్తున్న నటసింహా నందమూరి బాలకృష్ణ ఈ మధ్య కాలంలో చాలా పరాజయాలను చవి చూశారు. టికెట్ రేట్లు తక్కువలో, కరోనా పరిస్థితుల్లో గత ఏడాది చివర్లో 'అఖండ' అనే చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. బోయపాటి శ్రీను దర్శకత్వంలో భారీ అంచనాలతో వచ్చిన ఈ సినిమా భారీ విజయాన్ని అందుకుంది. 'అఖండ'మైన విజయాన్ని అందుకున్న జోష్‌తో ఉన్న నందమూరి బాలకృష్ణ. 'క్రాక్' డైరెక్టర్ గోపీచంద్ మలినేనితో సినిమా షూటింగ్ కూడా ప్రారంభం అయింది. అయితే ఈ సినిమా టైటిల్ గురించి ఇప్పుడు ఆసక్తికర ప్రచారం జరుగుతోంది. ఆ వివరాల్లోకి వెళితే

సిరిసిల్ల పట్టణంలో

సిరిసిల్ల పట్టణంలో

నందమూరి బాలకృష్ణ హీరోగా గోపీచంద్ మలినేని రూపొందించే సినిమాకు సంబంధించిన రెగ్యులర్ షూటింగ్ 18న తెలంగాణ రాష్ట్రంలోని సిరిసిల్ల పట్టణంలో నిరాడంబరంగా మొదలు పెట్టారు. అక్కడ కొన్ని పోరాట సన్నివేశాలు షూట్ చేస్తున్నారు. ఆ సీక్వెన్స్ లో బాలయ్యతో పాటు ముఖ్యమైన నటీనటులు భాగం కానున్నారని తెలుస్తోంది. దాదాపు 20 రోజుల పాటు అక్కడ షూటింగ్ సాగుతుంది. ఆ తర్వాత సినిమా షూటింగ్ ఆంధ్రప్రదేశ్‌కు షిఫ్ట్ అవుతుందని అంటున్నారు.

'మఫ్టీ'కి రీమేక్‌గా

'మఫ్టీ'కి రీమేక్‌గా

అయితే ఈ సినిమా షూటింగ్ మొదలైన రోజే యూనిట్‌కు ఊహించని షాక్ తగిలింది. మొదటి రోజు చిత్రీకరణలో పాల్గొన్న నటసింహం గెటప్‌కు సంబంధించిన లుక్ ఒకటి తాజాగా బయటకు వచ్చింది. ఇందులో బాలయ్య గుబురు గెడ్డంతో నలుపు రంగు చొక్కా.. లుంగీ ధరించి మాంచి సాల్ట్ అండ్ పెప్పర్ లుక్ లో కనిపిస్తున్నాడు. ఈ క్రమంలో నెటిజన్లు ఈ సినిమా కన్నడంలో వచ్చి సూపర్ డూపర్ హిట్ అయిన 'మఫ్టీ'కి రీమేక్‌గా తెరకెక్కుతోందని కామెంట్లు చేస్తున్నారు. దానికి కారణం అందులో శివ రాజ్ కుమార్ లుక్ లోనే బాలకృష్ణ కనిపిస్తున్నారు అని అంటున్నారు.

 కథను స్వయంగా

కథను స్వయంగా

అయితే అది అయ్యే అవకాశం లేదని అంటున్నారు. ఎందుకంటే దర్శకుడు ఈ సినిమా కథను స్వయంగా రాసుకున్నాడని తెలుస్తోంది. పల్నాడు ప్రాంతంలోని నిజ జీవిత ఘటనలను ఆధారంగా చేసుకుని ఈ సినిమా కధ రాసుకున్నారని తెలుస్తోంది. పవర్‌ఫుల్ సబ్జెక్టుతో రాబోతున్న ఈ సినిమాలో నందమూరి బాలకృష్ణ సరసన హాట్ బ్యూటీ శృతి హాసన్ నటిస్తోంది. అలాగే, ఈ మూవీలో వరలక్ష్మీ శరత్ కుమార్, దునియా విజయ్ వంటి స్టార్లు కూడా కీలక పాత్రలు చేస్తున్నారు.

‘వీరసింహారెడ్డి’

‘వీరసింహారెడ్డి’

ఇండస్ట్రీ వర్గాల్లో వినిపిస్తున్న టాక్ మేరకు ఈ సినిమాలో బాలకృష్ణ పాత్ర పేరు ‘వీరసింహారెడ్డి' అని తెలుస్తోంది. దీంతో దాదాపు ఈ పేరే టైటిల్ గా ఖరారు అయ్యే అవకాశంగా ఉంది. మరో ఆసక్తికరమైన విషయం ఏంటంటే అటు సింహా, ఇటు రెడ్డి పదాల కాంబినేషన్ ఆయనకు బాగా కలిసొచ్చింది. '‘రెడ్డి' టైటిల్ తో బాలయ్యకు హిట్ సెంటిమెంట్ వుంది. బాలకృష్ణ కెరీర్లో మైలురాయి లాంటి సినిమా ‘సమరసింహారెడ్డి'. మరో పక్క ‘సింహా' కూడా బాలయ్యకు బాగా కలిసొచ్చిన టైటిల్. ఈ రకంగా చూసుకున్నా ‘వీరసింహా రెడ్డి' టైటిలే ఫిక్స్ చేసే అవకాశం వుందని అంటున్నారు.

Recommended Video

Nandamuri Balakrishna With His Family At Pushpa Movie Special Screening | Filmibeat Telugu
దసరాకు విడుదల

దసరాకు విడుదల

ఈ సినిమాను మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్‌పై యలమంచిలి రవి, నవీన్ యెర్నేని నిర్మిస్తున్నారు. అలాగే, యంగ్ మ్యూజిక్ సెన్సేషన్ థమన్ దీనికి సంగీతం అందిస్తున్నాడు. రిషి పంజాబీ దీనికి సినిమాటోగ్రాఫర్‌గా పని చేస్తున్నారు. ఇక ఈ సినిమా షూటింగ్ వీలైనంత త్వరగా పూర్తి చేసి దసరాకు విడుదల చేయడానికి నిర్మాతలు ప్లాన్లు సిద్ధం చేస్తున్నారు. మరి చూడాలి, ఇది ఏ మేరకు వర్కౌట్ అవుతుంది అనేది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X