కొరియన్ సినిమాలో నటించేస్తున్న అల్లరి నరేష్
అల్లరి నరేష్ తాజాగా 'సిల్లిఫెలో' అనే చిత్రంలో చేస్తున్న సంగతి తెలిసిందే. వీరభద్ర చౌదరి అనే నూతన దర్శకుడుని పరిచయం చేస్తూ రూపొందుతున్న ఈ చిత్రం 'మ్యారియింగ్ మాఫియా' అనే కొరియా చిత్రం ఆధారంగా రూపొందుతోందని ఫిల్మ్ నగర్ సమాచారం. ఇందులో శ్రీహరి కూడా ఓ ప్రధాన పాత్రను చేస్తున్నారు. నమో వెంకటేశ, బిందాస్ చిత్రాలు నిర్మించిన ఎ.టివి సంస్ధవారు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇక 'మ్యారియింగ్ మాఫియా' ఆధారంగా హిందీలో 'వెలకమ్ 'చిత్రం వచ్చింది. అయితే వెలకమ్ లో కొన్ని ట్రాక్ లు శ్రీను వైట్ల 'కింగ్' లో లేపేసారు. కాబట్టి మిగిలిన వాటిమీదే ఆధారపడాలి. ఇక ఈ చిత్రంలో ఆహుతి ప్రసాద్, నాగినీడు, బ్రహ్మానందం, ఎమ్.ఎస్.నారాయణ, ధర్మవరపు, రంజిత వంటి వారు నటిస్తున్నారు. అలాగే సంగీతం రఘు కుంచె అందిస్తూంటే లోకనాధ్ కెమెరా వర్క్ చేయనున్నారు.
అల్లరి నరేష్ వీరభద్ర చౌదరి నమో వెంకటేశ బిందాస్ allari naresh veeru potla srinu vytla veerabhadram namo venkatesa


Click it and Unblock the Notifications