ఆ యంగ్ హీరో క్రేజ్ చూసి వెనక్కి తగ్గిన చిరు-వెంకీ.. భలే భయపెట్టాడుగా!
చిరంజీవి, వెంకటేష్.. ఓ కుర్ర హీరో సినిమాకు భయపడ్డారంటే.. మీకు ఆశ్చర్యంగా ఉంది కదా.. అది ఇప్పుడు కాదు.. 2000 సంవత్సరంలో ఈ బిగ్ స్టార్స్.. ఓ కుర్ర హీరో సినిమాకు భయపడ్డారట. అప్పటికే వెంకటేష్ కు రెండు ఫ్లాప్ లు రాగా.. చిరు కూడా ఆ హీరో హిట్లు చూసి ఆందోళన చెందారట. ఇక చేసేదేమి లేక మాతో పోటీ రాకండి అంటూ.. ఆ హీరో సినిమా నిర్మాతకు చెప్పారట. దీంతో ఆ నిర్మాత సినిమాను పోస్ట్ పోన్ చేసుకున్నాడట. ఆ వివరాల్లోకి వెళితే...
మెగాస్టార్ చిరంజీవి, విక్టరీ వెంకటేష్ ఇద్దరూ పెద్ద హీరోలే. ఇక వీరి సినిమా రిలీజ్ అంటే.. ఫ్యాన్స్ పండగ చేసుకుంటారు. అలాంటి వీరు ఓ కుర్ర హీరో సినిమా చూసి భయపడ్డారు. ఆ హీరో ఎవరో కాదు.. ఉదయ్ కిరణ్. 2000 సంవత్సరంలో ప్రేమ చిత్రాలు బాగా సక్సెస్ అయ్యేవి. ఆ రోజుల్లో లవర్ బాయ్ గా పేరు తెచ్చకున్న హీరో ఉదయ్ కిరణ్. తేజ దర్శకత్వంలో వచ్చిన చిత్రం సినిమాతో టాలీవుడ్ లోకి అడుగుపెట్టాడు ఉదయ్.

ఆ తర్వాత నువ్వు నేను సినిమాతో యూత్ లో మంచి క్రేజ్ సంపాదించుకున్నాడు. బ్యాక్ టు బ్యాక్ రెండు హిట్లతో మంచి జోష్ మీద ఉన్న ఉదయ్ కిరణ్ ను చూసి పెద్ద హీరోలు సైతం భయపడ్డారు. అయితే ఆయన నటించిన మూడో మూవీ 'మనసంతా నువ్వే' రిలీజ్ సమయంలో ఓ సంఘటన గురించి ఇండస్ట్రీలో ఆసక్తిగా చర్చించుకుంటున్నారు.
ఎంఎస్ రాజు నిర్మాణంలో వచ్చిన మనసంతా నువ్వే లవ్ ఎమోషనల్ హిట్టు మూవీగా నిలచింది. ఇందులో ఉదయ్ కిరణ్, రీమాసేన్ నటించారు. సునీల్ కామెడీ బాగా ఆకట్టుకుంటోంది. ఓ చిన్న స్టోరీ ఆధారంగా తెరకెక్కిన ఈ సినిమా కథ బాగుండడంతో పాటు పాటలు బాగా హిట్టయ్యాయి. ఈ సినిమా అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకుంది. అంతకుముందు రెండు సక్సెస్ సినిమాల తరువాత ఉదయ్ కిరణ్ కు ఇది కూడా విజయం సాధించడంతో ఆయన హ్యాట్రిక్ హీరో అని పేర్కొన్నారు.

మనసంతా నువ్వే సినిమాను ముందుగా 2001 సెప్టెంబర్ రెండో వారంలో రిలీజ్ చేయాలని అనుకున్నారు నిర్మాతలు. అయితే అప్పటికే వెంకటేశ్ నటించిన 'నువ్వు నాకు నచ్చావ్' రిలీజ్ డేట్ ను సెప్టెంబర్ 6న ఫిక్స్ చేశారు. దీంతో మనసంతా నువ్వే సినిమా రిలీజ్ ను రెండు వారాలు వెనక్కి జరపాలని ఆ చిత్ర నిర్మాత కోరాడని సమాచారం. అప్పటికే దేవిపుత్రుడు, ప్రేమతో రా సినిమాలు ప్లాప్ కావడంతో వెంకీకీ ఈ సినిమా సక్సెస్ ఇవ్వాలని నిర్మాత అభిప్రాయం.
అయితే అలా చేస్తే మెగాస్టార్ చిరంజీవి డాడీ సినిమాకు క్లాష్ అవుతుంది మనసంతా నువ్వే. 'డాడీ' సినిమాను అక్టోబర్ 4న రిలీజ్ తేదీని నిర్ణయించారు. ఉదయ్ కిరణ్ మనసంతా నువ్వే హిట్టయితే చిరంజీవి 'డాడీ' సినిమాకు ఇబ్బంది అవుతుందని ఆలోచించి.. ఆ చిత్ర నిర్మాత ఎంఎస్ రాజును కోరాడట. దీనితో మరో రెండు వారాలు వాయిదా వేశారు. అలా డాడీ సినిమా రిలీజ్ అయిన తరువాత మనసంతా నువ్వేను రిలీజ్ చేశారు. అనుకున్నట్లే డాడీ సినిమా కంటే మనసంతా నువ్వే బ్లాక్ బస్టర్ నిలిచింది. బాక్స్ ఆఫీస్ వద్ద వసూళ్ల వర్షం కురిపించింది. అలా ఈ సినిమాతో ఉదయ్ కిరణ్ హ్యాట్రిక్ కొట్టాడు.


Click it and Unblock the Notifications











