వెంకటేష్ కోసం అనిల్ రావిపూడి హై రిస్క్.. డిజాస్టర్ ట్రాక్ హీరోయిన్‌తో..
టాలీవుడ్ సీనియర్ హీరోల్లో విక్టరీ వెంకటేష్ ప్రస్తుతం ఫుల్ జోష్‌లో ఉన్నారు. గతేడాది సంక్రాంతికి విడుదలైన 'సంక్రాంతికి వస్తున్నాం'తో ఘన విజయం అందుకున్న వెంకీ మామ, సీనియర్ హీరోలలో తొలిసారిగా రూ.300 కోట్ల క్లబ్‌లోకి అడుగుపెట్టి ట్రేడ్ వర్గాలను ఆశ్చర్యపరిచారు. ఆ వెంటనే మెగాస్టార్ చిరంజీవి హీరోగా, దర్శకుడు అనిల్ రావిపూడి తెరకెక్కించిన 'మన శంకర వరప్రసాద్ గారు' లో గెస్ట్ రోల్‌లో కనిపించి సినిమాపై బజ్‌ను మరింత పెంచారు.
ఇక వరుస బాక్సాఫీస్ విజయాలతో 'సెన్సేషనల్ డైరెక్టర్'గా గుర్తింపు తెచ్చుకున్న అనిల్ రావిపూడి, తన తదుపరి సినిమాను 2027 సంక్రాంతికి తీసుకురావాలని ప్లాన్ చేస్తున్నారని ఇండస్ట్రీ వర్గాలు చెబుతున్నాయి. తాజాగా విడుదలైన మన శంకర వరప్రసాద్ గారు ఏకంగా రూ.388 కోట్లకు పైగా వసూళ్లు సాధించి ఇండస్ట్రీని షేక్ చేయడంతో, అనిల్ నెక్స్ట్ ప్రాజెక్ట్‌పై అంచనాలు ఆకాశాన్ని తాకుతున్నాయి. ఈసారి సినిమా టైటిల్ వింటేనే అందరూ ఆశ్చర్యపోతారని అనిల్ స్వయంగా చెప్పడం కూడా ఆసక్తిని పెంచుతోంది.

ఈ ప్రాజెక్ట్‌లో అనిల్ రావిపూడి తన లక్కీ హీరో వెంకటేష్‌తో ఐదోసారి పని చేయబోతున్నారని టాక్. ఇప్పటికే వీరి కాంబోలో వచ్చిన F2, F3, సంక్రాంతికి వస్తున్నాం వంటి సినిమాలు సంక్రాంతి బరిలో కాసుల వర్షం కురిపించాయి. ఈసారి కూడా అదే సెంటిమెంట్‌ను నమ్ముకుని, పూర్తిస్థాయి వినోదాత్మక కథతో స్క్రిప్ట్‌ను వేగంగా సిద్ధం చేస్తున్నారని సమాచారం. వెంకటేష్ బాడీ లాంగ్వేజ్‌కు తగ్గట్టుగా డిఫరెంట్ మేనరిజంతో కూడిన పాత్రను అనిల్ డిజైన్ చేస్తున్నారని ఇండస్ట్రీలో చర్చ నడుస్తోంది.
అయితే ఈ ప్రాజెక్ట్‌కు సంబంధించి తాజాగా ఓ వార్త సోషల్ మీడియాలో పెద్ద చర్చకు దారితీసింది. ఈ సినిమాలో హీరోయిన్‌గా పూజా హెగ్డేను ఎంపిక చేసే ఆలోచనలో అనిల్ రావిపూడి ఉన్నారనే ప్రచారం నెట్టింట వైరల్ అవుతోంది. గత కొన్నేళ్లుగా ఆమె నటించిన కొన్ని సినిమాలు వరుసగా ఫ్లాపులు కావడంతో, కొందరు నెటిజన్లు 'డిజాస్టర్ ట్రాక్ హీరోయిన్' అంటూ ట్రోల్ చేస్తున్నారు.
ఇలాంటి సమయంలో అనిల్ రావిపూడి లాంటి సక్సెస్‌ఫుల్ డైరెక్టర్ పూజాతో రిస్క్ చేయడం అవసరమా? డేంజర్‌లో పడబోతున్నారా? అంటూ సోషల్ మీడియాలో భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. మరోవైపు, అనిల్ మార్క్ ఎంటర్‌టైన్‌మెంట్ ముందు ఎలాంటి బ్యాడ్ సెంటిమెంట్ పనిచేయదని, వెంకటేష్-అనిల్ కాంబో మరోసారి మ్యాజిక్ చేస్తుందని ఫ్యాన్స్ ధీమా వ్యక్తం చేస్తున్నారు.
ఇదిలా ఉండగా, వెంకటేష్ మాత్రం చాలా సెలెక్టివ్‌గా సినిమాలు చేసుకుంటూ కెరీర్‌ను ముందుకు తీసుకెళ్తున్నారు. ప్రస్తుతం ఆయన త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో 'ఆదర్శ కుటుంబం హౌస్ నెం: AK 47'లో నటిస్తున్నారు. ఎన్నేళ్లుగా అనుకున్న వెంకీ-త్రివిక్రమ్ కాంబో ఇన్నాళ్ల తర్వాత సెట్ కావడంతో ఈ సినిమాపై కూడా భారీ అంచనాలు ఉన్నాయి. వెంకటేష్ కెరీర్ ఈ స్థాయికి చేరుకోవడంలో త్రివిక్రమ్ గతంలో కీలక పాత్ర పోషించిన విషయం తెలిసిందే.
ఇక సినిమాల విషయానికి వస్తే.. ప్రస్తుతం పూజ హెగ్డే తలపతి విజయ్ తో జన నాయగన్ సినిమా చేస్తోంది. విజయ్ చివరి సినిమాగా వస్తున్న ఈ మూవీ సంక్రాంతి సీజన్ నుంచి వాయిదా పడింది. కొత్త రిలీజ్ డేట్ పై ఇంకా క్లారిటీ రాలేదు. మొత్తానికి, వెంకటేష్ కోసం అనిల్ రావిపూడి తీసుకుంటున్నారని ప్రచారం జరుగుతున్న ఈ 'హై రిస్క్ క్యాస్టింగ్' నిజమవుతుందా? లేదా? అన్నది అధికారిక ప్రకటన వచ్చే వరకు తెలియదు. అయితే ఈ రూమర్లే టాలీవుడ్‌లో ఈ ప్రాజెక్ట్‌ను ఇప్పటి నుంచే హాట్ టాపిక్‌గా మార్చేశాయనడంలో మాత్రం ఎలాంటి సందేహం లేదు.


Click it and Unblock the Notifications











