సేఫ్ జోన్ లో అడుగులు వేస్తున్న వెంకటేష్.. మరో సూపర్ హిట్ మూవీ రీమేక్
టాలీవుడ్ ఇండస్ట్రీలో పెద్దగా నెగిటివ్ కామెంట్స్ అందుకోని అతి తక్కువమంది హీరోల్లో విక్టరీ వెంకటేష్ ఒకరు. నెగిటివ్ ఫ్యాన్స్ లేకుండా దాదాపు అందరి హీరోల అభిమానులు లైక్ చేసేలా సినిమాలు చేస్తుంటారు. నేటితరం హీరోలలో మొహమాటం లేకుండా కథకు తగ్గట్లుగానే మల్టీస్టారర్ సినిమాలు చేసిన ఏకైక హీరో. అయితే అప్పుడప్పుడు ఇతర భాషల్లో హిట్టయిన సినిమాలను తెలుగులో రీమేక్ చేసి హిట్స్ అందుకుంటూ ఉంటాడు.
ప్రస్తుతం దృశ్యం 2 తో సిద్ధమవుతున్న విషయం తెలిసిందే. అయితే ఆ సినిమా అనంతరం మరొక మలయాళం హిట్ సినిమాను కూడా తెలుగులో రీమేక్ చేయవచ్చని టాక్ వస్తోంది. మళయాళంలో పృథ్వీరాజ్, సూరజ్ వెంజరమూడు నటించిన డ్రైవింగ్ లైసెన్స్ అనే సినిమా 2017లో విడుదలైంది. ఆ సినిమా హిట్టయిన తరువాత చాలా మంది తెలుగు హీరోలు రీమేక్ చేయాలని అనుకున్నారు.

గత ఏడాది తెలుగు రీమేక్ పై అనేక రకాల రూమర్స్ వచ్చాయి. అయితే ఎవరు కూడా అఫీషియల్ గా ఎనౌన్స్మెంట్ అయితే ఇవ్వలేదు. ఇక వెంకటేష్ ఆ సినిమాపై ఇంగ్రెస్ట్ చూపిస్తున్నట్లు సమాచారం. ఇప్పటికే తన అన్నయ్య నిర్మాత సురేష్ బాబుతో కూడా చర్చలు జరిపినట్లు టాక్. వెంకటేష్ నారప్ప సినిమా విడుదలకు సిద్దంగా ఉన్న విషయం తెలిసిందే. ఇక ఆ తరువాత F3, దృశ్యం 2 సినిమాలు రాబోతున్నాయి. అనంతరం డ్రైవింగ్ లైసెన్స్ రావచ్చని టాక్. మరి వెంకటేష్ తో స్క్రీన్ షేర్ చేసుకునే మరొక హీరో ఎవరవుతారో చూడాలి.


Click it and Unblock the Notifications











