త్రిషను వదల్లేకే 'బాడీగార్డు' గా కమిటయిన వెంకటేష్ ?
Gossips
oi-Surya Prakash Josyula
By Srikanya
త్రిష, వెంకటేష్ కాంబినేషన్ లో నమో వెంకటేశ చిత్రం వచ్చిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత గ్యాప్ తో ఇప్పుడు త్రిషకు బాడీగార్డుగా వెంకటేష్ పనిచేయటానికి కమిటయ్యారు. ప్రస్తుతం కన్నడ చిత్రం 'ఆప్త రక్షక' రీమేక్ చేస్తున్న వెంకటేష్ తాజాగా మరో మళయాళ చిత్రం బాడీ గార్డ్ ని రీమేక్ ని ఓకే చేసినట్లు సమాచారం. కథలో హీరోయిన్ కి బాడీగార్డ్ గా హీరో వెళ్ళటం జరుగుతుంది. మళయాల ఒరిజనల్ లో నయనతార ఆ పాత్ర చేసింది. నయనతార ..సినిమాలు కి కొంత కాలం గ్యాప్ ఇద్దామనుకుంటున్న నేపధ్యంలో త్రిషనే ఆ ఆఫర్ వరించే అవకాశం ఉందని తెలుస్తోంది. వెంకటేష్ కూడా త్రిషకు ఓటేసాడని తెలుస్తోంది. ఇక ఈ చిత్రానికి దర్సకుడుగా మళయాళ దర్శకుడు సిద్దిక్ వ్యవహించనున్నారు. గీతా చిత్ర ప్రొడక్షన్స్..శివరాజు ఈ చిత్రం నిర్మించనుననున్నారు. శివరాజు గతంలో వెంకటేష్ తో పెళ్ళి చేసుకుందాం, పవిత్రబంధం చిత్రాలు నిర్మించారు. ఇక ఈ చిత్రం రీమేక్ ని తమిళంలో విజయ్, హిందీలో ( టైటిల్ 'మై లవ్ స్టోరీ' ) సల్మాన్ ఖాన్ ఈ రీమేక్ ని చేస్తున్నారు. ఇక వెంకటేష్, త్రిష లో కాంబినేషన్ లో రీసెంట్ గా నమో వెంకటేశ చిత్రం వచ్చింది.
Story first published: Sunday, October 31, 2010, 12:14 [IST]