పవన్ కల్యాణ్‌తో మళ్లీ వెంకటేష్.. అజ్ఞాతవాసిలో అతిథిగా విక్టరీ
Recommended Video

ఇప్పుడు టాలీవుడ్‌లో మల్టీస్టారర్ల వార్తల హవా కొనసాగుతున్నది. రాజమౌళి-రాంచరణ్-యంగ్ టైగర్ ఎన్టీఆర్, రాజ్ తరుణ్-శర్వానంద్, కృష్ణవంశీ-మాధవన్ లాంటి హీరోలు జోడీ కట్టి ప్రేక్షకులను ఆకట్టుకొనేందుకు ప్రయత్నిస్తున్నారు. తాజాగా పవన్ కల్యాణ్ నటిస్తున్న అజ్ఞాతవాసిలో విక్టరీ వెంకటేష్ నటిస్తున్నారనే వార్త వెలుగుచూడటం టాలీవుడ్‌లో చర్చనీయాంశమైంది.

అతిథి పాత్రలో వెంకీ
అజ్ఞాతవాసి చిత్రంలో వెంకటేష్ అతిథి పాత్రలో కనిపించనున్నారనే వార్త మీడియాలో విస్తృతంగా చక్కర్లు కొడుతున్నది. ఈ వార్త నిజమైనా కావొచ్చు. ఎందుకంటే పవన్, వెంకీల మధ్య మంచి అనుబంధం ఉంది. అంతేకాకుండా త్రివిక్రమ్ తదుపరి చిత్రంలో వెంకీ నటిస్తున్నాడు. క్రేజీ కోసం ఇలా గెస్ట్ అప్పీయరెన్స్‌ను ప్లాన్ చేసి ఉండవచ్చు అనే మాట వినిపిస్తున్నది.

గోపాల..గోపాల హిట్
గతంలో వెంకటేష్, పవన్ కల్యాణ్ కలిసి నటించారు. వారిద్దరు కనిపించిన గోపాల గోపాల చిత్రం సూపర్ హిట్ అయిన సంగతి తెలిసిందే. అంతేకాకుండా బాక్సాఫీస్ వద్ద మంచి కలెక్షన్లను రాబట్టింది. ఒకవేళ అజ్ఞాతవాసిలో వెంకటేష్ నటిస్తే సానుకూలమైన స్పందన వచ్చే అవకాశం ఉంది.

రూమారా? నిజమా
వెంకటేష్ నటించిన నువ్వునాకు నచ్చావ్, మల్లీశ్వరి చిత్రాలకు త్రివిక్రమ్ శ్రీనివాస్ డైలాగ్స్ రాశారు. త్వరలోనే వీరిద్దరూ కలిసి ఓ సినిమా కూడా చేయనున్నారు. మరి ‘అజ్ఞాతవాసి'లో వెంకటేష్ నిజంగా నటించారా? లేక గాసిపా? ఒకవేళ నటిస్తే వెంకీ ఏ పాత్రలో నటించాడు అనే విషయం అత్యంత ఆసక్తిని కలిగిస్తున్నది.

జనవరి 10న రిలీజ్
ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ‘అజ్ఞాతవాసి' సంక్రాంతి కానుకగా జనవరి 10న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈనెల 19న ఆడియో విడుదల కార్యక్రమం నిర్వహించనున్నారు. ఈ వేడుకలో చిరంజీవి పాల్గొనే అవకాశం ఉందనేది తాజా సమాచారం.

అనిరుధ్ సంగీతం
అనిరుధ్ స్వరాలు సమకూర్చిన సింగిల్స్ పాటలు ఇప్పటికే విడుదలై సంచలనం రేపాయి. అభిమానుల నుంచి మంచి స్పందన వచ్చింది. ఈ చిత్రంలో కీర్తిసురేశ్, అను ఇమ్మాన్యుయేల్ కథానాయికలు. హారికా, హాసిని క్రియేషన్స్ బ్యానర్‌పై ఎస్.రాధాకృష్ణ(చినబాబు) ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.


Click it and Unblock the Notifications











