రాజా విజయరాజేంద్ర బహుదూర్ గా వెంకటేష్

By Srikanya

త్వరలో వెంకటేష్ వెండితెరపై రాజా విజయరాజేంద్ర బహుదూర్ గా రాజసం ఒలకపోయనున్నారు. ఈ గెపట్ వెంకటేష్ తాజా చిత్రం నాగవల్లి కోసం వేసారు. దాదాపు 125 నాటి ప్లాష్ బ్యాక్ లో వెంకటేష్ ఇలా విచిత్ర వేషధారణతో కనపడనున్నారు. ఇక ఈ చిత్రం నాగవల్లి..ది రిటన్ ఆఫ్ చంద్రముఖి...నాగవల్లి అనే పెయింటింగ్ చుట్టూ కథ తిరుగుతుంది. ఈ పాతకాలం పెయింటింగ్ మైసూర్ లోని ఓ ఫ్యామిలీని అల్లకల్లోలం చేస్తుంది. ఆ ఫ్యామిలీ మెంబర్స్ సరస్వతి(అనూష్క), నీత(పూనం కౌర్),గౌరి(కమిలిని)ఆ పెయింటింగ్ తమ ఇంట్లోకి రావటం వల్ల సైక్లాజికల్ గా ఎఫెక్ట్ అవుతారు.ఎప్పుడూ ఉల్లాసంగా ఉండే ఆ ఇంటి వాతావరణం గంభీరంగా మారిపోతుంది. ఆ పరిస్దితిని సరిచేయటానికి రామచంద్ర ఆచార్య(వెంకటేష్)అనే మెజిషియన్ ని కలుస్తారు.రామచంద్ర ఆచార్య...డాక్టర్ విజయ్(వెంకటేష్ డబుల్) అనే సైకాలిజిస్టుని కలసి సమస్యను పరిష్కరించాలనుకుంటాడు. ఆ పరిష్కరించే క్రమంలో అన్ని కోణాలు నాగవల్లి(విమలారామన్)పెయింటింగ్ వైపు తిరుగుతాయి. ఆ పెయింటింగే వీటిన్నటికీ కారణమని అర్దం చేసుకుంటారు. ఆ ఇన్విస్టిగేషన్ దాదాపు 125 సంవత్సరాల నాటి ప్లాష్ బ్యాక్ కి దారి తీస్తుంది. అప్పటి రాజా ..విజయేంద్ర బహదూర్(వెంకటేష్)కి ఈ నాగవల్లితో చాలా శతాబ్దాలుగా వైరం ఉంటుంది. ఈ విషయం తెలుసుకున్న రామచంద్ర ఆచార్య ఏం చేసాడు. ఆ సమస్యను ఏ విధంగా డీల్ చేసాడనేది ఉత్కంఠభరితంగా ఉంటుందని చెప్తున్నారు. ఈ చిత్రం కన్నడ వెర్షన్ ఆప్త రక్షక డైరక్ట్ చేసిన పి.వాసే ఈ చిత్రాన్ని దర్శకత్వం చేస్తున్నారు. ఇక ఈ చిత్రం డిసెంబర్ రెండవ తేదీన విడుదల చేయాలని నిర్ణయించారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X