twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    బోడి గుండు విలన్ పాత్రలో వెంకటేష్

    By Bojja Kumar
    |

    వరుసగా ఫ్యామిలీ, కామెడీ ప్రధాన మైన చిత్రాల్లో నటించిన టాలీవుడ్ అగ్రహీరో వెంకటేష్ ఈ మధ్య విభిన్నమైన పాత్రలు చేయడమే పనిగా పెట్టుకున్నాడు. ఇటీవల నాగవల్లి సినిమాలో తాను గతంలో ఎన్నడూ చేయని విధంగా వైవిధ్యమైన విలన్ పాత్రను పోషించిన వెంకీ...తాజాగా బాడీగార్డు సినిమాలో నటిస్తున్నారు. సీనీవర్గాల నుంచి అందిన సమాచారం ప్రకారం వెంకీ మరోసారి విలన్ గా దర్శనం ఇవ్వబోతున్నాడట. అదీకూడా బోడి గుండుతో . వినడానికి ఆశ్యర్యంగా ఉంది కదూ.

    బాలీవుడ్ లో రూపొందుతున్న 'అగ్నిపథ్" సినిమా ట్రైలర్ ను చూసిన వెంకీ అందులో సంజయ్ దత్ పోషించిన బోడి గుండు విలన్ పాత్రపై మనసు పారేసుకున్నాడట. ఆ సినిమాను తెలుగులో రీమేక్ చేసి తాను విలన్ పాత్రలో ఇమిడిపోవాలని ఉవ్విల్లూరుతున్నాడు. ఇప్పటికే ఈ సినిమా రీమేక్ హక్కుల కోసం వెంకీ ప్రయత్నాలు మొదలు పెట్టినట్లు తెలుస్తూంది. మరో ఆసక్తికర విషయం ఏమిటంటే....హిందీ అగ్నిపత్ లో హీరో హృతిక్ రోషన్ పాత్రను తన అన్న కొడుకు రాణాతో చేయిస్తే బాగుంటుందనే ఆలోయనలో ఉన్నాట్లు సమాచారం. ఆసక్తి రేకిస్తున్న వెంకీ ఆలోచన ఎప్పుడు తెరపైకి ఎక్కుతుందో చూడాలి మరి.

    English summary
    Tollywood hero Venkatesh becomes 'Bodigundu Villain'. Venky after he looked at the first trailer of the Hindi movie ‘Agneepath’. It is heard that Venky was inspired by Sanjay Dutt’s role wherein he is sporting a Bodi Gundu with shaved eyebrows
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X