విక్టరీ వెంకటేష్ కూతురు ప్రేమ వివాహం, డేట్ ఫిక్స్ అయిందా?
టాలీవుడ్ స్టార్ విక్టరీ వెంకటేష్ ఇంట్లో త్వరలో పెళ్లి భాజాలు మ్రోగబోతున్నాయి. వెంకీ కూతురు ఆశ్రిత వివాహం నవంబర్ 24న జరగనున్నట్లు తెలుస్తోంది. ఈ మేరకు ఇప్పటికే దగ్గుబాటి కుటుంబంలో వేడుకకు సంబంధించిన సందడి మొదలైంది.
హైదరాబాద్ రేస్ క్లబ్ చైర్మన్ ఆర్ సురేందర్ రెడ్డి మనవడితో..... ఆశ్రిత వివాహం జరుగబోతోంది. ఇద్దరూ కొంతకాలంగా ప్రేమలో ఉన్నట్లు తెలుస్తోంది. వీరి ప్రేమకు ఇరు కుటుంబాలు అంగీకారం తెలుపడంతో వివాహానికి రంగం సిద్ధమైంది.

వివాహం జరిగేది ఎక్కడ?
ఆశ్రిత దగ్గుబాటి వివాహం హైదరాబాద్‌లోనే వైభవంగా నిర్వహించేందుకు ప్లాన్ చేస్తున్నారు. అయితే వేడుక ఎక్కడ జరుగుతుంది? అనే విషయంలో క్లారిటీ లేదు. రామానాయుడు స్టూడియో లేదా హైటెక్స్ ఇందుకు వేదిక కానుంది.

వరుడి పేరు ఇప్పటికీ రహస్యంగానే
అయితే వరుడి పేరు ఇప్పటికీ బయటకు రాలేదు. అసలు ఈ పెళ్లి వేడుకకు సంబంధించిన ఏ విషయం బయటకు పొక్కకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. సినిమా ఫ్యామిలీ కావడంతో మీడియాతో అనవసర ఇబ్బందులు ఉంటాయనే ఇలా చేస్తున్నట్లు సమాచారం.

కుకీస్ వ్యాపారంలో ఆశ్రిత
బేకరీ బిస్కట్స్ ఐటమ్స్ విషయంలో ఇంటర్నేషనల్ కోర్స్ చేసిన ఆశ్రిత... ఈ రంగంపై ఇంట్రెస్టుతో ఇంటర్నేషనల్ క్వాలిటీతో ఉండే బిస్కెట్స్, కుకీస్ తయారు చేసే వ్యాపారంలోకి అడుగుపెట్టారు.

సినిమా ఇండస్ట్రీకి దూరంగా..
ఆశ్రిత సినిమా ఫ్యామిలీలో పుట్టినా.... ఎందుకనో సినిమా ఇండస్ట్రీ వైపు రావడానికి ఆసక్తి చూపలేదు. ఆమెకు ఫుడ్, ట్రావెల్ అంటే చాలా ఇష్టం. సోషల్ మీడియాలో కూడా ఆమె ఫుడ్, ట్రావెల్‌కు సంబంధించిన ఫోటోలే పోస్టు చేస్తూ ఉంటారు.


Click it and Unblock the Notifications











